మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్‌లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!
డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
ఉదయం యూపీఐ సేవలు..
యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి.
Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు
Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన
Live Breakings | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu