YS Viveka Murder Case: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు! నాన్న(వివేక)ను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు వైఎస్ సునీత. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని.. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు. By Trinath 01 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sunitha Targets CM Jagan: ఐదేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ హత్య జరగడం రాజకీయంగా పెను ప్రకంపనలు రేపింది. ఈ హత్యలో నిందితులుగా ఉన్నవారు వైసీపీకి చెందినవారు కావడంతో ప్రతిపక్ష టీడీపీ ఈ కేసును ఎన్నికల ప్రచారంలో ఇప్పటికీ వాడుకుంటోంది. అదే సమయంలో వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. వివేక హత్య జరిగి ఐదేళ్లు కావోస్తున్న సమయంలో సునీతారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఏం అన్నారంటే? ➡ మా తండ్రి వైఎస్ వివేకా ఐదేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. ➡ మా తండ్రి 2019 మార్చి 14-15 రాత్రి హత్యకు గురయ్యారు. ➡ మా తండ్రి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ➡ ఐదేళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ➡ ఐదేళ్లుగా నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ➡ ఈ ఐదేళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బంది పడింది. ➡ నేను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్యకేసు గురించే అడుగుతున్నారు. ➡ నాకు అండగా నిలిచిన మీడియా, పోలీసు, లాయర్లకు కృతజ్ఞతలు. ➡ నాకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు. ➡ చంద్రబాబు, మహాసేన రాజేష్, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత గఫూర్ వంటి చాలా మంది సహకరించారు. ➡ నా పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ➡ సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది. ➡ ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోంది. ➡ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారు . ➡ సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం. ➡ ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు. ➡ మార్చురీ వద్ద అవినాష్.. నాతో మాట్లాడారు. ➡ ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుంది. ➡ వివేకా హత్యకేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారు. ➡ అరెస్టు, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టింది. ➡ కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదు. ➡ సీబీఐ పైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారు.. కేసు దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టి భయపెట్టారు.. ➡ కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ➡ అవినాష్ రెడ్డి అరెస్టు కోసం వెళ్లినప్పుడు కర్నూలులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ➡ సీబీఐ అరెస్టు చేయడానికి వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా చూశామా? ➡ వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇప్పటికీ అక్కడే ఉంది. జగనే లక్ష్యం? తాజా మీడియా మీటింగ్‌లో జగన్ టార్గెట్‌గా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. విలువలు, విశ్వసనీయత అని పదే పదే అంటుంటారని.. మాట తప్పను.. మడమ తిప్పనని చెబుతుంటారంటూ ఫైర్ అయ్యారు. మా నాన్న హత్య కేసులో ఇలాంటి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించార సునీతా. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుందని అడిగారు. మంచి, చెడుకు యుద్ధమంటున్నారని.. ఏది కరెక్టో వాళ్లే చెప్పాలని క్వశ్చన్ చేశారు. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటున్నారని.. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా.. పట్టించుకోవట్లేదని వాపోయారు. సిబ్బందిపై కేసుల తర్వాత కడప నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారని.. హైదరాబాద్ కు కేసు బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ ప్రారంభమైందని గుర్తు చేశారు సునీతా. హత్యా రాజకీయాలు ఉండకూడదని.. జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దని.. తమ అనుకునే వాళ్లకే న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు సునీతా. అవినాష్, భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణలో ఉన్నారని.. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారన్నారు. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని కుండబద్దలు కొట్టారు సునీతా. నిర్దోషి అయితే వదిలేయాలని.. నాన్న హత్య కేసును సాగదీస్తున్నారని ఫైర్ అయ్యారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదని.. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలని.. నాన్నను గొడ్డలితో చంపారు అనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు. జగనన్నకు ఎలా తెలుసో విషయం బయటికి రావాలన్నారు. సొంత కుటుంబం మీద ఎవరికీ అనుమానం రాదని.. కానీ ఒక్కో వాస్తవం బయటికి వస్తుంటే నమ్మాల్సి వచ్చిందని చెప్పారు సునీతా. 'అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది – తప్పు చేసినవారు తప్పించుకోకూడదు.. అందరినీ అనుమానించాల్సిందే.. విచారించాల్సిందే.. నన్ను విచారణ చేసినట్లే అందరినీ విచారణ చేయాలి.. విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను గుర్తించాలి..' అని వైసీపీ టార్గెట్‌గా సునీతా విరుచుకుపడ్డారు. Also Read: పవన్ ఇప్పటికైనా మిత్రులెవరో..శత్రువులెవరో తెలుసుకో: హరిరామజోగయ్య మరో లేఖ! #ys-jagan #ys-sunitha-reddy #ys-vivekananda-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి