Sunitha: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..! కడప కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. పై కోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. వాళ్లకో రూల్.. మాకో రూల్ ఉంటుందా? అని నిలదీశారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. By Jyoshna Sappogula 19 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Ys Sunitha Reddy: ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసుపై (YS Viveka Murder Case) నిన్న కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలో కడపలో ఇంటింటి ప్రచారం చేస్తున్న వైఎస్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Also Read: వైసీపీ MPTC దారుణ హత్య..! వైఎస్ వివేకా హత్య గురించి మాట్లాడొద్దని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసిందని..అయితే, తాను వైఎస్ వివేకానందరెడ్డి కూతురినని చెప్పుకొచ్చింది. మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నించింది. పైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేస్తామంది. వాళ్లకో రూల్ మాకో రూల్ ఉంటుందా అని నిలదీసింది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటానని తేల్చిచెప్పింది. Also Read: పంజా విసిరిన మావోయిస్టులు..మొన్నటి ఎన్‌కౌంటర్‌కు స్ట్రాంగ్ కౌంటర్..! కాగా, ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కడప వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్యపై మాట్లాడొద్దంటూ వై.ఎస్.షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ లకు కోర్టు సూచనలు చేసింది. #viveka-murder-case #ys-sunitha-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి