Revanth Reddy-Sharmila: రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా షర్మిల రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. By Nikhil 06 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ రోజు కలిశారు. హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనను కలిసి తన కుమారుడి నిశ్చితార్థం, వివాహానికి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డిని షర్మిల కలవడం ఇదే తొలిసారి. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియా నిశ్చితార్థం ఈ నెల 17న జరగనుంది. వీరి వివాహం వచ్చే నెల 17వ తేదీన జరగనుంది. వీరి వివాహానికి సంబంధించిన తొలి ఆహ్వాన పత్రికను షర్మిల ఈ నెల 2న ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) ఘాట్ వద్ద ఉంచారు. అనంతరం ఈ నెల 3న తన సోదరుడు జగన్ నివాసానికి వెళ్లి వారిని వివాహానికి ఆహ్వానించారు. అక్కడి నుంచే నేరుగా ఢిల్లీకి వెళ్లి ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల. ఇది కూడా చదవండి: YSR: వైఎస్సార్ మరణంపై అనుమానాలు ఉన్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్ ఇదిలా ఉంటే.. తెలంగాణలో మూడేళ్ల క్రితం వైఎస్సార్టీపీ పేరిట పార్టీ పెట్టిన షర్మిల.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక అంశాలపై పోరాటం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తర్వాత ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల భావించగా.. రేవంత్ రెడ్డి అడ్డుతగిలినట్లు ప్రచారం సాగింది. ఈ పరిణామాలతో ఆ సమయంలో కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ఆగిపోయింది. దీంతో ఓ దశలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించిన షర్మిల.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. Your browser does not support the video tag. తాజాగా కాంగ్రెస్ లో తన వైఎస్సార్టీపీ పార్టీని విలీనం చేశారు షర్మిల. అయితే.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. వైఎస్సార్టీపీలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు పది మందికి పైగా షర్మిల వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో షర్మిల అన్నపై ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఆమె ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. గతంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు ఆయనతో ఎలా వ్యవహరిస్తుందన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది. #cm-revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి