YS Jagan: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ!

ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్.. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. షర్మిల నేడు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

New Update
YS Jagan: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను (CM KCR) పరామర్శించిన తర్వాత.. లోటస్ పాండ్ లోని తన నివాసానికి ఏపీ సీఎం జగన్ (YS Jagan) వెళ్లారు. అక్కడే ఉన్న తల్లి విజయమ్మను (Vijayamma) ఆయన కలవనున్నారు. ఈ రోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో విజయమ్మతో జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. నిన్న తాడేపల్లిలో సీఎం జగన్ ను షర్మిల కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఆ సమయంలో షర్మిల వెంట విజయమ్మ వెళ్లలేదు.
ఇది కూడా చదవండి: KCR-Jagan: కేసీఆర్ కు జగన్ పరామర్శ.. షర్మిల ప్రస్తావన వచ్చిందా?

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి విజయమ్మ ఆమెకు మద్దతు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల నిర్వహించిన పలు ఆందోళనల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఓ పార్టీలో ఉండి మరో పార్టీకి మద్దతు ప్రకటించడం సరికాదంటూ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి సైతం విజయమ్మ రాజీనామా చేశారు. అయితే.. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం, ఏపీలో అన్న జగన్ పైనే పోరాటానికి సిద్ధం అవడంతో ఇప్పుడు విజయమ్మ ఎటు వైపు ఉంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పార్టీలో చేరడం ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తనను కాంగ్రెస్ లోకి ఆకర్షించిందన్నారు. పార్టీ ఏ పదవి ఇచ్చానా.. ఏ పని అప్పజెప్పినా పని చేస్తానన్నారు. ఏపీలో కాదు అండమాన్ లో అయినా.. పార్టీ కోసం పని చేస్తానన్నారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు షర్మిల.

Advertisment
Advertisment
తాజా కథనాలు