Ayodhya: అయోధ్యలో మాంసం, మద్యం అమ్మకాలు బంద్..యోగి ప్రభుత్వం ఆదేశాలు! అయోధ్య రామ మందిరం ప్రతిష్టను పురస్కరించుకుని ఆలయానికి 100 కోసి మార్గ్ లో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. By Bhavana 28 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి అయోధ్యలో జరగనున్న రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రామ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగే జనవరి 22 వ తేదీన ఆలయానికి దగ్గరల్లో 100 కోసి పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తో సమావేశం తరువాత యూపీ ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ ఈ విషయం గురించి మీడియా కి తెలిపారు. 84 కోసి పరిక్రమ మార్గ్ ను మద్యం నిషేధిత ప్రాంతంగా కూడా ప్రకటించారు. పవిత్ర నగరమైన అయోధ్యలో మద్యం నిషేధించే నిర్ణయం కొత్తదేం కాదు. 2018 నుంచే అయోధ్యలో స్థలం పవిత్రతను కాపాడుకోవడానికి మద్యం మాంసాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. 2022 జూన్ లో యోగి ప్రభుత్వం అయోధ్యతో పాటు మధురలో కూడా మద్యం అమ్మకాలను నిషేధించింది. దాంతో పాటు అధికారులు అయోధ్యలోని మద్యం విక్రయదారుల లైసెన్స్‌లను రద్దు చేశారు. దేవాలయాలకు సమీపంలో ఉన్న 37 మద్యం, బీరు, భాంగ్ దుకాణాలను మూసివేయాలని మథుర అధికారులను ఆదేశించింది. Also read: ఆటోలో తిరుగుతున్న అల్లు అర్జున్ ముద్దుల కూతురు..ఎక్కడంటే! #ayodhya #up #banned #yogi #meat-and-wine మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి