Delhi: కవిత, కేజ్రీవాల్ ఉన్న జైలులో కొట్టుకున్న ఖైదీలు లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత, సీఎం కేజ్రీవాల్ ఉన్న తీహార్ జైలులో నిన్న ఇద్దరు ఖైదీలు కొట్టుకున్నారు. జైలు నంబర్ 8, 9లో ఖైదీల మధ్య గొడవ జరిగిందని జైలు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. By V.J Reddy 27 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Tihar Jail: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఉన్న తీహార్ జైలులో నిన్న ఇద్దరు ఖైదీలు కొట్టుకున్నారు. జైలు నంబర్ 8, 9లో ఖైదీల మధ్య గొడవ జరిగిందని జైలు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారులు చెప్పారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 31 వరకు జైలులోనే.. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరికి మరోసారి జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించింది. అలాగే సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు ఇచ్చారు. సిసోడియా, కవితతో పాటు ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని కూడా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. Also Read: హిందు, బీజేపీ నేతలను చంపేందుకు పాకిస్థాన్ కుట్ర! #delhi #latest-news-in-telugu #tihar-jail మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి