VRO caught by ACB Officials: రైతుల వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని యేరువారిపల్లి గ్రామ వీఆర్వో వేణు గోపాల్.. ఏసీబీ అధికారులు పన్నిన వలలో చిక్కారు. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పేరంగూడిపల్లికి చెందిన వలంటీర్ వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి.. తన తండ్రి లక్ష్మిరెడ్డికి ఉన్న 2.73 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయాలని వీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని సంప్రదించారు. అయితే ఇందుకు వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి రూ.30 వేలు లంచం డిమండ్ చేశారు. దీంతో వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి రూ.21 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం భాస్కర్ రెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వీఆర్వో వేణుగోపాల్ రెడ్డతో వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.21 వేలు అందిస్తుండగా.. అక్కడే మారు వేషంలో ఉన్న ఏసీబీ అధికారులు వీర్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టకున్నారు.

New Update
VRO caught by ACB Officials: రైతుల వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని యేరువారిపల్లి గ్రామ వీఆర్వో వేణు గోపాల్.. ఏసీబీ అధికారులు పన్నిన వలలో చిక్కారు. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పేరంగూడిపల్లికి చెందిన వలంటీర్ వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి.. తన తండ్రి లక్ష్మిరెడ్డికి ఉన్న 2.73 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయాలని వీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని సంప్రదించారు.

అయితే ఇందుకు వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి రూ.30 వేలు లంచం డిమండ్ చేశారు. దీంతో వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి రూ.21 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం భాస్కర్ రెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వీఆర్వో వేణుగోపాల్ రెడ్డతో వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.21 వేలు అందిస్తుండగా.. అక్కడే మారు వేషంలో ఉన్న ఏసీబీ అధికారులు వీర్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టకున్నారు.

అనంతరం వీర్వో వేణుగోపాల్ రెడ్డిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. వీఆర్వోకు సంబంధించిన మరో రూ.32,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించకముందు ఓ దంపతుల వద్ద నుంచి వీర్వో డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు అధికారులు. ఆ సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక ప్రజలు భారీ ఎత్తున గుమిగూడారు. వీరిని చెదరగొట్టేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు