AP Times Now ETG Opinion Poll: ఏపీలో వైసీపీదే హవా...టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఆంధ్రలో వైసీపీని తలదన్నేవాడు ఎవడూ లేడంటోంది టైమ్స్ నౌ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెబుతోంది టైమ్స్ నౌ ఈటీజీ ఒపినీయన్ పోల్. క్రితంసారి కంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. By Manogna alamuru 14 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 24-25 సీట్లను వైసీపీనే దక్కించుకుంటుందని వెల్లడైంది టౌమ్స్ నౌ ఈటీజీ ఒపినీయన్ పోల్ లో. టీడీపీ ఎక్కువలో ఎక్కువ ఒకస్థానం దక్కించుకుంటుందని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇంతకు ముందు కన్నా బలపడింది అంటోంది ఒపీనియన్ పోల్. ఆ పార్టీకి వ్యతిరేకత ఉందని వార్తలు వినిపిస్తున్నా ఎన్నికల్లో మాత్రం అదే గెలుస్తుందని చెబుతోంది. గత ఐదేళ్ళల్లో ఆంధ్రలో ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల చేత ఓటు వేయించేలా చేస్తాయని అంటోంది. అయితే పోల్, సర్వే ఫలితాలు కేవలం అంచనా మాత్రమే. ఇవి ఎప్పుడైనా తారు మారు కావొచ్చు. పార్టీ అభ్యర్ధులను ప్రకటించాక...అప్పుడు పరిస్థితులను బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరోవైపు టీడీపీ మాత్రం ఫలితాల మీద ధీమాగా ఉంది. వైసీపీ వ్యతిరేకతే తమను గెలపిస్తుందని చెబుతున్నారు. ఎన్నికలకు సిద్ధం అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నారు. అభ్యర్ధుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. TIMES NOW- @ETG_Research Survey Who will win how many seats in Andhra Pradesh? Total Seats- 25 - YSRCP: 24-25 - TDP: 0-1 - JSP: 0 - NDA: 0 Watch @TheNewshour as @NavikaKumar also takes us through seat share projections from K'taka, Tamil Nadu, Assam & Telangana. pic.twitter.com/O8FcOFcojh — TIMES NOW (@TimesNow) December 13, 2023 Also Read:హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ…టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్ #ycp #andra-pradesh #times-now-etg-opinion-poll #lokasbha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి