YSRCP-Jagan: వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన!

వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. దొంగ సర్వేలను చూపెట్టి తనకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జల చెప్పాడని ఫైర్ అయ్యారు. రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు.

New Update
YSRCP-Jagan: వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన!

MLA Kapu Ramachandra: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) విజయం సాధించి మరోసారి అధికారం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న అధికార వైసీపీకి (YSRCP) పలు నియోజకర్గాల్లో తలనొప్పులు ఎదురవుతున్నాయి. అభ్యర్థుల మార్పు కారణంగా టికెట్ దక్కని సిట్టింగ్ లు అధినేతపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ అధినేత, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ (CM Jagan) మా గొంతు కోశాడంటూ ధ్వజమెత్తారు. 2012 నుంచి జగన్ వెంట నడిచినందుకు తానకు టికెట్ లేదని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: ‘బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరు’.. మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్

దొంగ సర్వేల పేరు చెప్పి తనకు టిక్కెట్ ఇవ్వలేము అన్నారంటూ ధ్వజమెత్తారు. అయినా.. తాను పోటీ చేస్తానని ప్రకటించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు. ఉదయం నుంచి వేచి చేసినా తమకు సీఎం అపాయిట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జల చెప్పినట్లు తెలిపారు.

నమ్మి మోసపోయాం..
నమ్మి మోసపోయామంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ కు దండం పెట్టి తన నిరసన తెలిపారు. తమ ఇంట్లో ఎక్కడ చూసినా జగన్ ఫొటోలే ఉంటాయన్నారు కాపు రామచంద్రారెడ్డి. వైసీపీ, జగన్ ను నమ్మితే తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దుమారం రేపుతోన్న అభ్యర్థుల మార్పు..
ఇదిలా ఉంటే.. వైసీపీలో అభ్యర్థుల మార్పు దుమారం రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను అనేక మందిని వచ్చే ఎన్నికల్లో పక్కకు పెడుతుండడంతో మిగతా వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో అనేక మంది అధినేత జగన్ ను కలిచేందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో థర్డ్ లిస్ట్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు