Chandrababu: జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు

AP: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌లకు వైసీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే విషయంపై బాబుకు ఈసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.

New Update
Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ - సీఎం చంద్రబాబు నాయుడు

YCP Complaint On Chandrababu: సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌లకు (Election Commission) వైసీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పలాస, రాజాం టీడీపీ ఆద్వర్యంలో ఈనెల 15 వ తేదీన జరిగిన సభలలో చంద్రబాబు సీఎం జగన్ ను (AP CM Jagan) ఉధ్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలను కూడా ఎన్నికల సిఇఓ ముఖేష్ కుమార్ మీనాకు అందజేశారు.

ALSO READ: భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు హతం!

ఇటీవలే చంద్రబాబుకు ఈసీ నోటీసులు...

ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లఘించారని నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎ‍మ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. 48 గంటల్లోగా అఫిడవిట్‌ రూపంలో వివరణ ఇవ్వాలని కోరింది.

సీఎం జగన్ పై విమర్శల యుద్దానికి దిగారు చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో ఏపీలో పసుపు జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రచారాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ పై విమర్శలు డోస్ పెంచారు. ఇటీవల ఎ‍మ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం సభల్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లఘించారని వైసీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సభల్లో సీఎం జగనే టార్గెట్ గా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల అధికారి.. వచ్చిన ఫిర్యాదుపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని బాబుకు నోటీసులు జారీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు