AP Elections : చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించేలా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా ఇదే అంశంపై చంద్రబాబు, పవన్‌కు ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

New Update
AP Elections :  చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

YSRCP : టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై ఎన్నికల సంఘానికి(Election Commission) వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించేలా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా ఇదే అంశంపై చంద్రబాబు, పవన్ కు ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు పై ఈసీ సీరియస్..

బహిరంగ సభల్లో సీఎం జగన్(CM Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. కొన్ని నోటీసులకు మాత్రమే చంద్రబాబు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొన్ని నోటీసులకు చంద్రబాబు స్పందించలేదు. 

చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను సీఈవో మీనా పరిశీలించారు. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు. వీడియో క్లిప్పులను కూడా జత చేస్తూ సీఈవో లేఖ పంపారు.

Also Read : ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం షురూ

Advertisment
Advertisment
తాజా కథనాలు