/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-14T173420.276.jpg)
Prakasham: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత పలు చోట్ల ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. వైసీసీ, టీడీపీ కూటమి మధ్య ఓటింగ్ వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, వాదంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంచినీళ్ల పంపు దగ్గరకు వెళ్లిన మహిళల మధ్య పోలింగ్ సరళిపై మాట మాట పెరగడంతో గొడవకు దారి తీసింది. అదికాస్త చినికి చినికి గాలి వానగా మారడంతో వైసీపీ, టీడీపీ గ్రూపులు బాహాబాహికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దయెత్తున మోహరించి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. వీధుల్లోకి ఎవరూ రావొద్దని స్థానికులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.