అదిరే స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌ రోజే 3లక్షల యూనిట్ల అమ్మకాలు.. క్రేజ్‌ అంటే ఇదే కదా బాసు!

మార్కెట్‌లో రిలీజైన తొలి రోజే రెడ్‌ మీ 12 సిరీస్‌ దుమ్మురేపింది. ఏకంగా 3లక్షల యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది. ఫ్లిక్‌కార్ట్‌, అమెజాన్‌లో రెడ్‌ మీ 12 సిరీస్‌ 5జీ బుక్‌ చేసుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మీ వద్ద ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ ఉన్నట్లయితే Redmi 12 4G లేదా Redmi 12 5Gకి చెందిన 4GB RAM వేరియంట్ కొనుగోళ్లపై రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

New Update
అదిరే స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌ రోజే 3లక్షల యూనిట్ల అమ్మకాలు.. క్రేజ్‌ అంటే ఇదే కదా బాసు!

మీరు కొత్త స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మార్కెట్‌లో ఏ మొబైల్‌కి క్రేజ్‌ ఎక్కువగా ఉందని థింక్‌ చేస్తున్నారా? అయితే ఈ లెక్కలు మీ కోసమే..! Xiaomi ఇండియా నుంచి తాజాగా విడుదలైన రెడ్‌ మీ 12(Redmi 12) సిరీస్ ప్రారంభించిన తొలి రోజే రికార్డుల మోత మోగించింది. దేశంలో ప్రారంభించిన ఫస్ట్ డేనే 3లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ డిజైన్‌తో పాటు ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడంతో రికార్డ్ సేల్స్‌ని కొల్లగొట్టింది. సాధారణ ధరకే అసాధారణమైన పనితీరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తోన్న ఈ మొబైల్‌ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకర్షణీయమైన ఆఫర్‌లతో పాటు అదనపు తగ్గింపులు అందుబాటులో ఉండడంతో.. Mi.com, Flipkart.com, Amazon.com, Mi Home, Mi Studio లాంటి సైట్లకు ఈ ఫోన్‌ని బుక్‌ చేసుకోవడం కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు.

Redmi 12 5G ధర, ఆఫర్లు, తగ్గింపులు:
ఈ ఫోన్ మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. మోడల్‌ల వేరియంట్‌ల ధరలపై ఓ లుక్కేయండి..

4GB + 128GB - రూ 10,999

6GB + 128GB - రూ 12,499

8GB + 256GB - రూ. 14,499

ప్రస్తుతం ఈ మొబైల్స్‌పై ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ వద్ద ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ ఉన్నట్లయితే Redmi 12 4G లేదా Redmi 12 5Gకి చెందిన 4GB RAM వేరియంట్ కొనుగోళ్లపై రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఇప్పటికే ఉన్న Xiaomiకి సంబంధించిన మొబైల్స్ కల్గి ఉన్న వాళ్లు ఎక్స్‌చేంజ్ పెట్టాలనుకుంటే Redmi 12 4Gకి చెందిన 4GB RAM వేరియంట్‌పై రూ.1000 బోనస్‌ను పొందవచ్చు. Redmi 12 4Gకి చెందిన 6GB RAM వేరియంట్ లేదా Redmi 12 5Gకి చెందిన 8GB RAM వేరియంట్‌ని కొనాలనుకుంటే రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇక ప్రస్తుతం అమెజాన్‌లో ఇండిపెండెన్స్‌ డే సేల్‌ కూడా నడుస్తోంది. రెడ్‌మీకి సంబంధించిన ఇతర మొబైల్స్‌పైపా ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా Redmi Note 12 5G రెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ప్రస్తుతం షావోమి అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.23,999 ఉండగా రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ హెచ్‌డిఎఫ్‌సి లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ. 20,999లకే పొందవచ్చు. అంతేకాకుండా రూ.2,999 గల రెడ్‌మీ బడ్స్ 4 యాక్టివ్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌తో కేవలం రూ.999లకే పొందవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు