World Cup 2023: టేబుల్ టాపర్స్ మధ్య సూపర్ ఫైట్.. వరల్డ్ కప్ లో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ 

New Update
World Cup 2023: టేబుల్ టాపర్స్ మధ్య సూపర్ ఫైట్.. వరల్డ్ కప్ లో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ 

Ind vs SA World Cup 2023: టోర్నీలో ఇప్పటివరకూ ఓటమి అనేదే తెలీని భారత్ జట్టు.. ఒక్క మ్యాచ్ లో ఓడినా.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ సెకండ్ ప్లేస్ లో వచ్చిన సౌతాఫ్రికా జట్టు.. ప్రపంచ కప్ 2023లో రెండు బలమైన టీమ్స్ మధ్య ఆసక్తికర పోరు మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా (India Vs South Africa) టీమ్స్ రెండూ ఫేవరేట్ టీమ్స్ గా ఉన్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ పోరాటానికి వేదిక కానుంది. ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్‌ ఉంటుంది. లీగ్ దశలో ఇప్పటివరకూ 36 మ్యాచ్ లు జరిగాయి. భారత్ - సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. రెండు జట్లూ సెమీస్ కు అర్హత సాధించాయి. భారత్‌కు 14 పాయింట్లు, దక్షిణాఫ్రికాకు 12 పాయింట్లు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈరోజు మ్యాచ్ గెలిచిన జట్టు టాప్ 1 కి చేరుకుంటుంది. లీగ్ దశలో ఈరోజు చేరుకున్న ప్లేస్ లో ఆ జట్టు ఉంటుంది. అంటే, ఈ మ్యాచ్ గెలిచిన టీమ్ లీగ్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. 

దక్షిణాఫ్రికాపై భారత్ హ్యాట్రిక్ సాధిస్తుందా?
దక్షిణాఫ్రికా 1992 వన్డే ప్రపంచకప్‌లో(World Cup) తొలిసారిగా తలపడ్డాయి. ఆ సమయంలో భారత్ ఓడిపోయింది. అప్పటి నుంచి 2011 వరకు, ప్రపంచ కప్‌లో రెండు టీమ్స్  3 సార్లు తలపడగా, దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలిచింది. కాగా 2015, 2019లో రెండు టీమ్స్  2 మ్యాచ్‌ల్లో తలపడగా, రెండింటిలోనూ  టీమ్ ఇండియా విజయం సాధించింది. అంటే ఈరోజు జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా (Team India) టోర్నీలో సౌతాఫ్రికాపై (South Africa) హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసినట్టు అవుతుంది. 

సౌతాఫ్రికానే టాప్ 

వన్డే మ్యాచ్  లలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ మొత్తం 90 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 37, దక్షిణాఫ్రికా 50 మ్యాచ్ లు గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా పోయాయి. ఈ రెండు టీమ్స్  చివరిసారిగా గతేడాది అక్టోబర్‌లో భారత్‌లో పోటీ పడ్డాయి. ఈ సమయంలో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.

భారత్ బలం ఇలా.. 

ఈ మ్యాచ్ కు(World Cup 2023) ముందు భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అక్టోబరు 19న పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ చీలమండ ట్విస్ట్ కారణంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. ఇక ఆతిథ్య భారత్ టోర్నీ(World Cup 2023) అంతటా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. జట్టు బ్యాట్స్‌మెన్ - బౌలర్లు ప్రతి ఒక్కరూ మైదానంలో 100 శాతం రాణిస్తున్నారు. టోర్నీ మొత్తం ఇప్పటి వరకూ భారత్ జట్టు ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) 7 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 442 పరుగులు చేశాడు. కాగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో జట్టులో టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. 

Also Read: క్రికెట్ లో విశ్వ ‘విరాట్’.. కోట్లాది రూపాయల ‘కొహ్లీ’ బ్రాండ్

నాలుగు సెంచరీల డీకాక్..
టోర్నీ(World Cup 2023) మొత్తం  సౌతాఫ్రికా టీమ్  కూడా అద్భుతమైన ఫామ్‌లో కనిపించింది. ఆ జట్టు నెదర్లాండ్స్‌పై అనూహ్యంగా ఒకే ఒక్క ఓటమి చూసింది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) జట్టు తరఫున అత్యధికంగా 545 పరుగులు చేశాడు. టోర్నీలో టాప్ స్కోరర్ కూడా అతనే. 7 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు కూడా అతని పేరిట ఉన్నాయి. మార్కో జాన్సన్ 16 వికెట్లతో జట్టులో టాప్ బౌలర్‌గా నిలిచాడు.

ఇవి ఈరోజు జరిగేనా? 

  • వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును సమం చేయడానికి విరాట్ కోహ్లీ (48) మరో సెంచరీ దూరంలో ఉన్నాడు. ఈరోజు పూర్తి చేయడం ద్వారా కొహ్లీ  తన 35వ పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.
  • దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీయడం ద్వారా తన వన్డే కెరీర్‌లో 50 వికెట్లు పూర్తి చేయనున్నాడు.
  • లుంగీ ఎన్‌గిడి వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్‌ను 30 బంతుల్లో 4 సార్లు అవుట్ చేశాడు.

పిచ్ ఎలా ఉండవచ్చు?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని వికెట్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచకప్‌లో (World Cup 2023)ఇప్పటివరకు ఇక్కడ 2 మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ మొత్తం 33 వన్డేలు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 19 మ్యాచ్‌లు గెలవగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు. 

2014లో శ్రీలంకపై భారత్ చేసిన 404 పరుగులే ఈ మైదానంలో అత్యధిక స్కోరు. 1993లో భారత్‌పై వెస్టిండీస్ చేసిన 123 పరుగుల అత్యల్ప స్కోరు. 

వాతావరణం ఎలా ఉంటుంది?

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కోల్‌కతాలో(World Cup 2023) ఆదివారం వాతావరణం క్లియర్ గా ఉంటుంది. వర్షం పడే అవకాశం 4% ఉంది. ఈ సమయంలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తేమ దాదాపు 36% ఉంటుంది. ఉష్ణోగ్రత 23 నుంచి  33 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.

ఫైనల్ 11 ఇలా ఉండవచ్చు : 

భారత్: 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

సౌతాఫ్రికా: 

టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ.

Watch this interesting video:

Advertisment
Advertisment
తాజా కథనాలు