World Cup 2023: 'మూర్ఖుడు', 'అనర్హుడు..' ఆ పిచ్‌లపై ఎవడైనా వికెట్లు తీస్తాడు..ఇదేం తిట్టుడు భయ్యా! అక్షర్ పటేల్ స్థానంలో టీమిండియా వరల్డ్ కప్ జట్టుకు వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ని సెలక్ట్ చేయడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. ఇండియాలో ఉండే స్పిన్ టాంపరింగ్ పిచ్‌లపై ఏ మూర్ఖుడైనా వికెట్లు తియ్యగలడాని అశ్విన్‌పై చిందులువేశాడు భారత్ మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్. అశ్విన్‌కి బదులు వాషింగ్టన్ సుందర్‌ని సెలక్ట్ చేసి ఉండాల్సిందని ఇప్పటికే యువరాజ్ సింగ్ సైతం అభిప్రాయపడ్డాడు. By Trinath 02 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Criticism over R Ashwin inclusion in team: వరల్డ్‌కప్(world cup) ప్రధాన మ్యాచ్‌లు అక్టోబర్ 5నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ ప్రారంభానికి ముందు అక్షర్ పటేల్(Axar Patel) టీమిండియాకు దూరం అవ్వడం అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) సెలక్ట్ కావడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఎందుకంటే అశ్విన్ టీమిండియా తరఫున వన్డేలు ఆడి ఏళ్లు గడిచిపోయాయి. ఈ ఆరేళ్లలో కేవలం నాలుగు వన్డేలే ఆడాడు అశ్విన్. టెస్టుల్లో నంబర్-1 బౌలర్ ఐనప్పటికీ వన్డేల్లో మాత్రం అశ్విన్ యాక్టివ్ ప్లేయర్ కాదు. అయినా అశ్విన్ అనుభవాన్ని చూపించి జట్టులో అతని స్థానాన్ని సమర్థించుకుంది బీసీసీఐ. అయితే అశ్విన్ స్థానాన్ని ప్రశ్నించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వన్డే ప్రపంచ కప్‌కు అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌ని సెలక్ట్ చేయడాన్ని ఇప్పటికే టీమిండియా 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్‌సింగ్ ప్రశ్నించగా.. తాజాగా ఆ జాబితాలో భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్(Laxman Shivaramakrishnan) చేరిపోయాడు. అశ్విన్‌ని ఏకంగా మూర్ఖుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. Indian batsman are struggling against spin because the pitches in India are doctored for Ashwin in Test matches. Look at his record in SENA Countries 😂😂😂😂 — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) September 30, 2023 'సేనా' దేశాల్లో అతని రికార్డులు చూడండి: స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు స్పిన్ పిచ్‌లు తయారు చేసుకోవడం.. ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టడం ఇటివలి కాలంలో టీమిండియా అనుసరిస్తున్న స్ట్రాటజీ. ముఖ్యంగా టెస్టుల్లో ఇండియా గెలుపునకు పిచ్‌లే కారణమన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శివరామకృష్ణన్ అశ్విన్‌పై విరుచుకుపడ్డాడు. 'టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ పిచ్‌లు అశ్విన్‌కు అనుకూలంగా ఉండటం వల్ల టీమిండియా బ్యాటర్లు స్పిన్ ఆడేందుకు కష్టపడుతున్నారు. సేన(SENA) కంట్రీస్‌లో అతని రికార్డును చూడండి' అని ఈ కామెంటేటర్ ఫైర్ అయ్యాడు. మీ కంటే మంచి బౌలర్ సర్: అశ్విన్‌పై శివరామకృష్ణన్ చేస్తున్న విమర్శలను తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఈ కామెంటేటర్‌పై మాటల దాడికి దిగాడు. మీ కంటే అశ్విన్ గొప్ప బౌలర్ అంటూ చురకలంటించాడు. 2011, 2015 వరల్డ్‌కప్‌తో పాటు ఈ ఏడాది మూడో ప్రపంచకప్ ఆడుతున్న అశ్విన్ 94 టెస్టుల్లో 489 వికెట్లు, 115 వన్డేల్లో 155 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు 1983 నుంచి 1987 వరకు భారత జట్టుకు ఆడిన శివరామకృష్ణన్ 9 టెస్టులు ఆడి 26 వికెట్లు పడగొట్టడంతో పాటు 16 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ అభిమాని చూపించిన స్టాట్స్‌పై స్పందించిన శివరామకృష్ణన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'భారత్‌లో టాంపరింగ్ పిచ్‌లపై ఏ మూర్ఖుడైనా వికెట్లు తీస్తాడన్నాడు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా మైదానానికి వెళ్లి ఏయే ప్రాంతాలను ట్యాంపరింగ్ చేయాలో గ్రౌండ్ స్టాఫ్‌కు చెబుతారని.. తాను చాలాసార్లు ఈ విషయాన్ని కళ్లారా చూశానని మరో కామెంట్లో పేర్కొన్నాడు. అశ్విన్‌ను అనర్హుడు, లయబిలిటీ ఫీల్డర్‌గా అభివర్ణించాడు. ALSO READ: ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన ఇండియన్ ప్లేయర్స్.. ఒక్క రోజులో ఎన్ని పతకాలు సాధించారంటే.. #ravichandran-ashwin #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి