Women's Health Tips: రుతుక్రమం విషయంలో మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను క్రమం తప్పకుండా మార్చాలి. ప్రతి 4-6 గంటలకోసారి ప్యాడ్‌ల మార్చాలని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల దుర్వాసన లాంటి సమస్యలు రావు. ఇక మీరు ఏవైనా ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్‌లో గనుక పాల్గొంటే వెంటనే ప్యాడ్స్‌ను మార్చాలి.

New Update
Women's Health Tips: రుతుక్రమం విషయంలో మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

Women's Health Tips: నేటి స్త్రీల జీవన విధానం చాలా మారిపోయింది. మహిళ జీవితమంతా ఆఫీసు, ఇల్లు, పిల్లలను చూసుకోవడంతోనే గడిచిపోతోంది. పని ఒత్తిడిలో పడి తమ ఆరోగ్యాన్ని మహిళలు అస్సలు పట్టించుకోరు. వయసు పెరుగుతున్న కొద్దీ అనేక అనారోగ్య సమస్యలు వారిని చుట్టు ముడుతున్నాయి. చెడు జీవనశైలి కారణంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ట్యూమర్, బీపీ, హైబీపీ, థైరాయిడ్ కేసులు రోజురోజుకూ వేగంగా పెరుగుతున్నాయి. పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం నేటికీ భారతదేశంలో మహిళలకు శానిటరీ ప్యాడ్‌లు కూడా అందని చాలా గ్రామాలు ఉన్నాయి. రుతుక్రమంలో కొన్ని విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం.

శానిటరీ ప్యాడ్లు క్రమం తప్పకుండా మార్చాలి:

  • పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను క్రమం తప్పకుండా మార్చాలి. ప్రతి 4-6 గంటలకోసారి ప్యాడ్‌ల మార్చాలని వైద్యులు చెబుతున్నారు. ప్యాడ్‌ని గంటల తరబడి మార్చకపోతే అందులో బ్యాక్టీరియా పెరిగి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. బయటకు వెళ్లినప్పుడల్లా హ్యాండ్‌బ్యాగ్‌లో అదనపు శానిటరీ ప్యాడ్‌లను ఉంచుకోవాలి.

శానిటరీ ప్యాడ్‌లనే పడేసేప్పుడు:

  • శానిటరీ ప్యాడ్‌లను పారేసేటప్పుడు వాటిని టాయిలెట్ పేపర్‌లో లేదా రేపర్‌లో చుట్టి ప్రత్యేక డస్ట్‌బిన్‌లో వేయండి. బాత్‌రూమ్‌లో శానిటరీ ప్యాడ్‌లను ఎప్పుడూ ఫ్లష్ చేయవద్దు. ఎందుకంటే అది పైపులో చిక్కుకుపోతుంది. అలాగే పర్యావరణ కాలుష్యానికి కూడా కారణం కావచ్చు.

పరిశుభ్రత ముఖ్యం:

  • పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించాలి. రెండుసార్లు గోరువెచ్చని నీరు, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. రోజూ స్నానం చేసి ఇన్నర్‌వేర్ మార్చుకోవడం మర్చిపోవద్దు. బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే కాటన్ బట్టలు ధరించాలని నిపుణులు అంటున్నారు.

పోషకాహారం ముఖ్యం:

  • పీరియడ్స్ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి. ఇది మిమ్మల్ని రోజంతా హైడ్రేట్‌గా ఉంచుతుంది. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి. పీరియడ్స్ సమయంలో పర్ఫెక్ట్ డైట్ పాటించాలి. కెఫిన్, ఉప్పగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో ఇలా తినడం వల్ల వాపు, అసౌకర్యంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి:  కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఇదే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు