Himachal Pradesh:నెలలో ఐదు రోజులు ఆడవాళ్లు బట్టలు వేసుకోని ఊరు..అదెక్కడుందో తెలుసా..

భారతదేశం విభిన్న సంప్రదాయాల నెలవు. ఇక్కడ ఉన్నన్ని ఆచారాలు, నమ్మకాలు మరెక్కడా ఉండవు. ఇందులో వింత వింతవి కూడా ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పబోతున్నది కూడా అలాంటి వితం ఆచారం గురించే. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికీ పాటిస్తున్న ఓ సంప్రదాయం గురించి మీరు చదివేయండి..

New Update
Himachal Pradesh:నెలలో ఐదు రోజులు ఆడవాళ్లు బట్టలు వేసుకోని ఊరు..అదెక్కడుందో తెలుసా..

Himachal Pradesh:మనదేశంలో ప్రతీ ఊరికీ, ప్రతీ రాష్ట్రానికీ ఆచారాలు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. కొన్ని చోట్ల అయితే ఇంటి ఇంటికీ కూడా వేరు వేరుగా ఉంటాయి. వీటి గురించి రాయడం మొదలుపెడితే పెద్ద గ్రంథమే అవుతాయి. కొన్ని ఆచారాలు ఎప్పుడు , ఎక్కడ మొదలవుతాయో కూడా తెలియదు కానీ ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు. అడిగితే వాటి గురించి రకరకాల కథలు కూడా చెబుతుంటారు.

భారతదేశంలో ఇప్పటికీ కొన్ని పాంత్రాల్లో పురాతన సంప్రదాయాలను పాటిస్తున్నారు. అవి చాలా వింతగా ఉంటాయికూడా. ఈ కాలంలో వాళ్ళకి అర్ధం లేనివిగా అనిపించినా వారికి మాత్రం చాలా పట్టింపు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఓ గ్రామంలో ఇలాంటి వింత ఆచారమే ఉంది. ఇక్కడ ఓ నెలలో ఐదు రోజులు ఆడవారు అస్సలు బట్టలు వేసుకోరు. హిమాచల్ ప్రదేశ్‌లో మణికర్ణ లోయలోని బిని అనే గ్రామంలో దీనిని పాటిస్తున్నారు. ఇప్పుడుకొంత కాలం మారాక వయసులో ఉన్న ఆడవారు ఏదో కాస్త వేసుకుంటున్నారు కానీ కాస్త వయసు పైబడ్డవారు మాత్రం ఇప్పటికీ నెలలో ఐదు రోజులు బట్టలు వేసుకోరు. వయసులో ఉన్న వాళ్ళు కూడా ఒక ముక్క మాత్రమే ధరిస్తారు. ఈ సమయంలో ఉన్నితో చేసిన పడ్కాను వేసుకుంటారు.

ఈ ఆచారం ఎలా వచ్చింది...

బిన్ని గ్రామంలో ఎప్పుడో పూర్వ కాలంలో రాక్షసులు, దెయ్యాలు సంచరించేవిట. అవి కేవలం దుస్తులను ధరించి అందంగా ఉన్న ఆడవారిని మాత్రమే ఎత్తుకెళ్ళిపోయేవట. ఆ టైమ్‌లో లాహు గోండ్ అనే దేవత ఈ గ్రామంలోని మహిళలను రక్షించింది. దానికి గుర్తుగా బిన్ని గ్రామంలో మహిళలు చవాన్ నెలలో 5 రోజులు బట్టలు ధరించారు. దీనిని ఇప్పటికీ బలంగా నమ్ముతారు. అలా కాదు అని ఆచారాన్ని వ్యతిరేకించి దుస్తులు ధరించే మహిళలను కొద్ది రోజుల్లోనే దురదృష్టం వరించి ఏదో ఒకటి జరిగిన సంఘటనలు ఉన్నాయిట. అందుకే తప్పనిసరిగా ఊరిలో ఉన్న ఆడవారు అందరూ ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ రోజుల్లో గ్రామంలో మహిళలు ఎవరూ బయటకు వెళ్ళకు వెళ్ళకుండా ఇంటిలోనే నిర్భందించబడి ఉంటారు.

పురుషులకూ ఆంక్షలు...

చవాన్ నెలలో ఐదు రోజులు మహిళలకే కాదు పురుషులకు కూడా ఆంక్సలు ఉన్నాయి. ఈ రోజులు మగవాళ్ళు ఎవరూ మద్యం, మాంసం ముట్టుకోకూడదు. అలాగే ఈ 5 రోజులు భార్యాభర్తలు నవ్వుతూ మాట్లాడకుండా దూరంగా ఉండాలని చెబుతారు. ఆమె నవ్వుతూ ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఆ దెయ్యం తిరిగి వచ్చి అమ్మాయిని తీసుకెళ్తుందని ఈ ఊరి ప్రజల నమ్మకం. దీంతో పాటూ బయట వ్యక్తులను కూడా ఈ ఐదు రోజులూ గ్రామంలోకి అనుమతించరు. ఆ రోజుల్లో జరిగే వేడుకలకు బయటి వ్యక్తులు ఎవ్వరూ పాల్గొనకూడదు కూడా.

Also Read:Tamilnadu:రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్

Advertisment
Advertisment
తాజా కథనాలు