Winter : చలికాలంలోనూ తగ్గేదేలే... చమటలు పట్టిస్తోన్న ఎండ..!!

హైదరాబాద్‌లో ఎండ దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలపైగా దాటింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కువై అవకాశం ఉందని టీఎస్ డీపీఎస్ అధికారులంటున్నారు.

New Update
Winter : చలికాలంలోనూ తగ్గేదేలే... చమటలు పట్టిస్తోన్న ఎండ..!!

Weather Changes : ఎండాకాలం(Summer) కి ఇంకా నెల రెండు నెల సమయం ఉంది. మొన్నటి వరకు చలి(Cold) తో ప్రతి ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేసిన శీతాకాలం(Winter) ఇప్పుడు ఎండలతో అందరినీ చంపేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranti) పండగ సంబరాలు మొదలయ్యాయి. చలితో పండగ ఎలా చేసుకోవాలని ప్రజలనుకుంటే ఇప్పుడు ఎండ అందరికీ చెమటలు పట్టిస్తోంది.

మధ్యాహ్నం పూట ఎండ బీభత్సం:

తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చలికాలం ఇంకా పూర్తి కాకుండా.. మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడుతోంది. దీంతో నగర వాసులతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిన్న హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు ఉండగా.. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలపైగా దాటింది.

వాతవరణ పరిస్థితుల మార్పులు:

నిన్న హైదరాబాద్‌(Hyderabad) లో కొన్ని ప్రాంతాలోని ఉష్ణోగ్రతలు: షేక్‌పేట- 33.3, మోండామార్కెట్-33.0, గోల్కొండ- 33.0, ఖైరతాబాద్- 33.3, బహదూర్‌పురా- 33.0, అమీర్‌పేట- 35.1 హిమాయత్‌నగర్- 32.5, మారేడ్పల్లి- 32.4, బండ్లగూడ-32.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైయిందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వెల్లడిచింది. అంతేకాకుండా ఇది రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కువై అవకాశం ఉందని టీఎస్ డీపీఎస్ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే మూడు రోజులలో హైదరాబాద్‌లో ఎటువంటి వర్షపాతం ఉండదన్నారు. అసలే చలికాలం, దీనికి తోడు వాతవరణ పరిస్థితుల మార్పుల వల సీజనల్ వ్యాధులు వస్తాయని ప్రజలు భయ పడుతున్నారు.ఈ కాలంలో ఎక్కువగా దగ్గు, అయసం ఉన్నటువంటి వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. ఎండతో మరి ఎలాంటి సమస్యలు వస్తాయని జనం భయ పడుతున్నారు.

ఇది కూడా చదవండి : 1. నిద్రలేవగానే ఫోన్‌ చూస్తున్నారా?.. ఈ సమస్యలు తప్పవు

                                       2. చలికాలంలో బరువును తగ్గించే బెస్ట్‌ సూప్స్‌.. ట్రై చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు