Zomato : దుమారం రేపిన పచ్చడ్రెస్ నిర్ణయం.. వెనక్కు తీసుకున్న యాజమాన్యం ప్యూర్ వెజ్ వాళ్ళకు పచ్చడ్రెస్, మిగతా వాళ్ళకు రెడ్ డ్రెస్ అంటూ జొమాటో తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ యూనిఫామ్ కోడ్‌ను ఎత్తేసింది. ఇక మీదట అందరు డెలివరీ బాయ్స్ రెడ్ డ్రెస్ మాత్రమే వేసుకుని వస్తారని చెప్పింది. By Manogna alamuru 20 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Zomato Pure Veg Fleet : జొమాటో(Zomato) తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద దుమారమే రేపింది. ప్యూర్ వెజ్(Pure Veg) ప్లీట్ అంటూ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ప్యూర్ వెజ్ వాళ్లకు ఒక కొత్త ఫ్లీట్ సేవలను ప్రారంభించడమే కాకుండా ఆ ఫుడ్‌ను డెలివరీ చేసేవాళ్లు పచ్చరంగు డ్రెస్(Green Color Dress) వేసుకొస్తారని జొమాటో తెలిపింది. అయితే సోషల్ మీడియా(Social Media) లో దీని మీద చాలా పెద్ద గొడవ జరిగింది. అలా ఎలా వెజ్, నాన్ వెజ్ అని విభజిస్తారంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తినే తిండికి కూడా కులాలు, మతాల రంగులను అద్దుతున్నారని మండిపడ్డారు. దీంతో కొన్ని గంట వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. ఆన్‌లైన్‌లో కొన్ని వర్గాలనుంచి అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనివలన రెగ్యులర్ జొమాటోను కూడా బహిష్కరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేవలం డ్రెస్ కోడ్(Dress Code) ను మాత్రమే తీసేస్తున్నామని.. ఫ్యూర్ వెజ్ ఫ్లీట్‌ను మాత్రం తీయడం లేదని స్పష్టం చేశారు దీపిందర్ గోయల్. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఏ ఉద్దేశమూ లేదు.. తాము ప్రవేశపెట్టిన ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి మత లేదా రాజకీయపరమైన ఉద్దేశమూ లేదని అన్నారు సీఈవో దీపిందర్ గోయల్(Deepinder Goyal). ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డెలివరీ బాక్సుల్లో ఆహారం ఎంతో కొంత ఒలుగుతూనే ఉంటుంది. దీనివలన ముందు డెలివరీ చేసిన ఫుడ్ వాసన తరువాత దానికి అంటుకుంటుంది. ఇది కొందరు ప్యూర్ వెజ్ తినే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఫ్లీట్‌ను వేరు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. కొంతమంది మాంసాహారం వండని హోటళ్ళ నుంచి మాత్రమే ఫుడ్ తెప్పించుకుంటారు. వారిని దృష్టిలో ఉంచుకునే ప్యూర్ వెజ్ ఫ్లీట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. శాకాహారుల నుంచి ప్రత్యేకమైన విజ్ఞప్తిలు వచ్చాకనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఫ్యూజర్‌లో వ్యతిరేకత వస్తే... దీన్ని కూడా తీసేస్తామని తెలిపారు గోయల్. Also Read : Uttarapradesh:వాడు మనిషి కాదు…నరరూప రాక్షసుడు..పిల్లలను చంపి రక్త తాగాడు #zomato #pure-veg-fleet #green-dress #red-dress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి