HANU- MAN RELEASE: హను- మాన్ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ?

సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం ఆనవాయితీగా వస్తోంది,చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ క్రమంలో హను - మాన్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

New Update
HANU- MAN RELEASE: హను- మాన్ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ?

HANU - MAN : సంక్రాంతి బరిలోకి వచ్చే తెలుగు సినిమాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. చివరి వరకూ ఏ సినిమా డ్రాప్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఫిలిం ఛాంబర్ అద్యక్షుడు దిల్ రాజు అభ్యర్ధన మేరకు రవితేజ మూవీ ఈగల్ మూవీ డ్రాప అయింది. ఇక.. ఈ లైన్లో హను - మాన్ మూవీ కూడా ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయినా హను - మాన్ ఎక్కడా డ్రాప్ అయ్యే పరిస్థితి లేదని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నైజాం ఏరియా హక్కులను మైత్రి సంస్థ తీసుకున్నారు. మైత్రి వారికి మహేష బాబుకు మంచి అనుబంధమే ఉంది. మొహమాటానికి ఏమయినా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటె ఉండొచ్చని కూడా టాక్ నడుస్తోంది. దిల్ రాజు కూడా మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది.

పెద్ద సినిమాలకే ఫస్ట్ ప్రయారిటీ

థియేటర్స్ ఫస్ట్ ప్రయారిటీ గుంటూరు కారం మూవీకే అని. ఆ తరువాత వరుసలో వెంకటేష్ సైంధవ్ మూవీకి , నాగార్జున నా సామిరంగా చిత్రాలకు ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక.. అణ్ణన్ అయినా తరువాత ఏమయినా మిగులు తగులు థియేటర్స్ ఉంటె హను- మాన్ కు కేటాయిస్తారు. ఈ మూవీ బడ్జెట్ పరంగా చాలా భారీ సినిమా. ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇలాంటి సినిమాకు చాలా థియేటర్స్ లో రిలీజ్ అయితే గాని నిర్మాత గట్టెక్కే పరిస్థితి లేదు.సో.. ఈ లెక్కలన్నీ వేసుకుని మైత్రి వాళ్ళు మనసు మార్చుకుని సినిమాను కాస్త పోస్ట్ ఫోన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈగల్ మూవీ ఫిబ్రవరి 9 కి వాయిదా వేసుకున్నారు.కేవలం వ్యాపార దృక్పధంతో అలోచించి డేట్ పోస్ట్ ఫోన్ చేయడం జరిగిందని ఆ చిత్ర నిర్మాతలకు దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. చూడాలి మరి. ఏ నిమిషానికి ఏమి జరుగునో.
ALSO READ:YATRA 2 TEASER :యాత్ర 2 మూవీ రాజకీయ దుమారం లేపనుందా ?

Advertisment
Advertisment
తాజా కథనాలు