Telangana BJP: బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా? తెలంగాణలో బీజేపీ నయా స్ట్రాటజీ.. బండి సంజయ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించింది. దాని ఫలితంగా ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా బండి నిలబడతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ను ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దాంతో ఆయన ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. By Shiva.K 20 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay Kumar Karimnagar MLA: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ(BJP) కొత్త వ్యూహం రచిస్తోందా? బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే ఆలోచనలో ఉందా? రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీల ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా వ్యూహం పన్నుతోందా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణలో ఎన్నికలకు ముందే.. బీసీ సీఎం అని ప్రకటించేలా ప్లాన్ సిద్ధం చేసిందట బీజేపీ. ఈ ప్లాన్ ప్రకారం.. సీఎం రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్ ఉన్నారని టాక్. ఇటీవలి కాలంలో పార్టీలో ఈటల రాజేందర్(Etela Rajender) బాగా యాక్టీవ్ అయ్యారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటిలో ఆయన ముందుంటున్నారు. అయితే, అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందనే మాత్రం సస్పెన్స్‌గా మారింది. బండికి బ్రేక్.. ఈ ముచ్చట ఇలా ఉంటే.. బండి సంజయ్‌కు (Bandi Sanjay) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించింది. దాని ఫలితంగా ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా బండి నిలబడతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో తెలంగాణతో (Telangana) పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముంగిట జరుగుతున్న ఈ ఎన్నికలు అధికార ఎన్డీయేకి చాలా కీలకం. అందుకే.. ఈ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ను ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దాంతో ఆయన ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్.. అయితే, ఇప్పుదిడే బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సంబంధించిన అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆయన్ను ఛత్తీస్‌ఘడ్ స్టార్ క్యాంపెనర్‌గా నియమించడంతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేస్తాడా? చేయడా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బండి అటు స్టార్ క్యాంపెనర్‌గా ఇటు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగడం అనేది దాదాపు అసాధ్యం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిత్యం పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు బండి సంజయ్. అధిష్టానం ఆదేశిస్తే కరీంనగర్ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతానంటూ ఇప్పటికే తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం విడుదల చేసిన ప్రకటన.. బండి సంజయ్ ఎమ్మెల్యే పోటీకి బ్రేకులు వేసినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగని ఇదే జరుగుతుందని చెప్పలేమంటున్నారు. బండి సంజయ్ ఏక కాలంలో అటు ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారం చేస్తూనే.. ఇటు తన నియోజకవర్గంలోనూ ప్రచారం నిర్వహించుకునే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కమల దళం ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలియాలంటే.. పార్టీ అభ్యర్థుల లిస్ట్ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. #telangana #telangana-politics #telangana-bjp #bandi-sanjay-kumar #telangana-assembly-elections-2023 #karimnagar-mla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి