AP: సినిమా స్టైల్‌లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి..

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరేంద్రను భార్య హత్య చేయించింది. కిరాయి ముఠాకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. హత్య చేసిన అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. నిందితులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
AP: సినిమా స్టైల్‌లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి..

AP Crime: సినిమా స్టైల్‌లో భర్తను హత్య చేయించింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను కిరాయి ముఠాతో చంపించింది. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లా (Prakasam) పొదిలిలో చోటుచేసుకుంది. ఈనెల 3న ఒంగోలు పీఎఫ్‌ ఆఫీస్‌లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న నరేంద్రకుమార్‌ మృతి చెందాడు. నరేంద్రకుమార్ మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: సెల్‌ఫోన్ సిగ్నల్ లేని ఊరు.. 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందే..!

ఏఆర్ ఎస్పీ దామోదర్ ఈ కేసుపై వివరాలను వెల్లడించారు. పీఎఫ్ సూపరింటెండెంట్ నరేంద్రకుమార్‌ను భార్య హత్య చేయించిందని తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని.. రూ.2 లక్షలతో సుపారీ ఇచ్చి భర్తను కిరాయి ముఠాతో హత్య చేయించిందన్నారు. నరేంద్ర నిద్రిస్తుండగా..నిందితులు అతడి మెడకు తాడు బిగించి హత్య చేశారని.. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తెలిపారు.

Also Read: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!

నరేంద్రకుమార్ మృతిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు భయటపడ్డాయన్నారు. నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధం కోసం భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపుతున్న ఘటనలు ఎక్కువ అయ్యాయి. అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment