తులసి మొక్కను పవిత్రమైనదిగా ఎందుకు భావిస్తారు? శాస్త్రం చెబుతుంది నిజమేనా? శాంతికి చిహ్నమైన తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిని బహుమతిగా ఇచ్చిపుచ్చుకోవడాన్ని చాలామంది శుభప్రదంగానే పరిగణిస్తారు. ఇది ఇంటికి సానుకూల శక్తిని అందించడంతోపాటు సామరస్య వాతావరణాన్ని అందిస్తుందని శాస్త్రం చెబుతోంది. By srinivas 07 Feb 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Tulsi plant: తులసి శాంతికి చిహ్నం. హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక రోజుల్లోనే ఈ తులసిని ఇంటికి తెచ్చుకుని పూజిస్తారు. అలాగే ఈ తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడాన్ని చాలామంది శుభప్రదంగానే పరిగణిస్తారు. దీన్ని అందించడం ద్వారా ఇతరుల ఇంటికి మీరు సానుకూల శక్తిని ప్రసారం చేస్తారని, తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని పండితులు చెబుతారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షణ.. అయితే ఇంట్లో వాస్తు ప్రకారం తులసి మొక్కను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఈశాన్యదిశగా సూచిస్తున్నారు పండితులు. ఇక గాలిని శుద్ధి చేయడానికి, ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి సహాయపడే ఈ తులసి మొక్క మొక్కను తాకడం వల్ల ప్రతిరోజు ఏదో తెలియని శక్తి మనలో ప్రతికూల వాతావరణాన్ని నింపుతుందంటారు. మీరు ఎవరికైనా తులసి మొక్కను బహుమతిగా ఇస్తే, ఆ మొక్కను ఆరోగ్యంగా, చక్కగా సంరక్షించడం మీ విధి. జ్యోతిష్యాన్ని విశ్వసిస్తే, తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడం వల్ల మీ ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది. ఇతరుల ఇంటికి సానుకూల శక్తిని ప్రసారం ఇంట్లో సామరస్య వాతావరణాన్ని అందిస్తుంది. ఇది కూడా చదవండి: Mahender Reddy : మచ్చలేని అధికారిని.. అవినీతి ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి ఇంటి వాతావరణం ప్రశాంతం.. మీరు ఎవరికైనా తులసిని బహుమతిగా ఇస్తే, అది మీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ఆదివారం, ఏకాదశి తొలిరోజు తులసిని ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదని చెబుతుంటారు. ఇస్తే ప్రతికూల వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారు. ఇక ఎండిన మొక్కను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. వాస్తు ప్రకారం తులసి మొక్క చాలా పవిత్రమైంది. మతపరమైన పండుగలు, వివాహాలు, గృహ ప్రవేశాల్లో సమర్పిస్తే అనుకూలంగా ఉంటుంది. బహుమతిగా ఇచ్చిన తులసి మొక్కను సరిగ్గా కాపాడుకోవడం మన విధి. #friends #tulasi-plan #considered-sacred #gift-for-ralations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి