Whole Grains: తృణధ్యాన్యాలు తీసుకుంటే ఇన్ని లాభాలా.. తెలిస్తే వీటిని అస్సలు వదలరు తృణధాన్యాలను నిత్యం తీసుకుంటే హృద్యోగ ముప్పు చాలావరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతిరోజూ 28 గ్రాముల తృణధాన్యాలు తీసుకుంటే హృద్యోగ ముప్పు 22 శాతం వరకు తగ్గుతుందని తెలిపాయి. అలాగే ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో, బరువు తగ్గడానికి కూడా సహకరిస్తాయి. By B Aravind 17 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలుంటాయని పోషకాహార నిపుణులు తరచుగా చెబుతునే ఉంటారు. తృణధాన్యాల్లో ఉండే పలు పోషకాలు శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయని ప్రస్తావిస్తుంటారు. అంతేకాదు 2024 ఏడాదికి మెరుగైన ఆహారంగా ఎంపికైన మెడిటేరేనియన్ డైట్‌లో కూడా తృణధాన్యాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఫైబర్, థైమిన్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, ఫోలేట్ వంటి బీ విటమిన్స్‌తో పాటు తృణధాన్యాలు పోషకార పవర్‌హౌస్ అని నిపుణులు అంటున్నారు. Also Read: చలికాలంలో పిల్లలు వ్యాధులకు దూరంగా ఉండాలంటే..చిటికెడు ఇది తినిపించండి చాలు! అయితే ఈ తృణధాన్యాల్లో ప్రొటీన్, లిగ్నాన్స్, ఫైటిక్ యాసిడ్, ఫురులిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. డ్రై ఓట్స్ సింగిల్ ఔన్స్‌లో 3 గ్రాముల ఫైబర్, రోజుకు సరిపడింత మాంగనీస్, ఫాస్పరస్, అలాగే ఇతర పోషకాలు కూడా లభ్యమవుతాయి. అయితే తృణధాన్యాలను నిత్యం తీసుకుంటే హృద్యోగ ముప్పు చాలావరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతిరోజూ 28 గ్రాముల తృణధాన్యాలు తీసుకుంటే హృద్యోగ ముప్పు 22 శాతం వరకు తగ్గుతుందని తెలిపాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగపరిచి, బీపీని తగ్గించడంలో తృణధాన్యాలు ప్రభావితంగా పనిచేస్తాయని.. దీనివల్లే హృద్యోగ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే వీటిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకున్నట్లైతే.. మధుమేహాన్ని నియంత్రించడంలో, బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. అలాగే తృణధాన్యాల్లో ఉండేటటువంటి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ద్వారా క్యాన్సర్ ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. Also Read: కాలం ఏదైనా కానివ్వండి..నీటిని మాత్రం తాగడం ఆపకండి..లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందే! #health-news #whole-grains #grains #gelath-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి