Akhil Pailwan : రాంనగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? వ్యభిచార ముఠా కథ ఇదే! హైదరాబాద్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గలీజు దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే.. ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ కీలక సుత్రధారి. ఇంతకి ఈ రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? పూర్తి డీటేయిల్స్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 21 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Ramnagar Akhil Pailwan : రామ్ నగర్(Ram Nagar) అఖిల్(Akhil Pailwan).. ఈ పేరుకు, ఈ వ్యక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రామ్ నగర్ బోనాలతో ఫుల్ ఫేమస్ అయిన ఈయనకు పొలిటికల్ గాను మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ నగర్ బోనాలు వచ్చాయంటే చాలు.. పొలిటికల్ లీడర్స్(Political Leaders) తో కలిసి ఫుల్ హల్ చల్ చేస్తాడు. కొత్త కొత్త బోనాల పాటలను రాయిస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు. అఖిల్ హోటల్ ఫుల్ ఫేమస్: ఇక ఈయన తండ్రి సుజుకీ శ్రీనుకి కూడా పొలిటికల్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్సార్(YSR) హయాంలో రామ్ నగర్ ఏరియాలో ఈయన ఫార్ట్యూన్ హోటల్(Fortune Hotel) ను కట్టాడు. ఇప్పటికీ రామ్ నగర్ ఏరియాలో ఈ హోటల్ ఫుల్ ఫేమస్ గా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయన గుండెపోటుతో మరణించడంతో.. అఖిల్ పహిల్వాన్ తెరపైకొచ్చాడు. పెళ్లికి హాజరైన సినీ పెద్దలు: మొదటి నుంచి కుస్తీలంటే ఆసక్తి ఉన్న అఖిల్..ఎన్నో కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు.ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అఖిల్ పహిల్వాన్ కుస్తీ పోటీలు కండక్ట్ చేయడం.. బోనాల సాంగ్స్ రాయించడంతో రామ్ నగర్‌లో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ మధ్యే ఈయన పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లికి కూడా మంచు మనోజ్, అఖిల్ సార్థక్ సహా కొందరు వీఐపీలు అటెండ్ అయ్యారు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం: ఇక తాజాగా అతని ఫార్చ్యూన్ హోటల్ పై రైడ్ చేసిన పోలీసులు వ్యభిచార ముఠా(Prostitution Batch) ను అరెస్ట్ చేశారు. మొత్తం 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమానిని అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలోనే వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలతో అఖిల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం వేసి.. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. Also Read: డివోర్స్ పై మౌనం వీడిన సానియా.. టెన్నిస్ స్టార్ షాకింగ్ రియాక్షన్! WATCH: #crime-news #prostitution-racket-in-hyderabad #akhil-pailwan #ram-nagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి