Ugadi 2024 : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.!

హిందువులు జరుపుకునే ప్రతిపండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఉగాది రోజుల ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండగరోజు ఏ దేవుడిని పూజించాలి..పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

New Update
Ugadi 2024 : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.!

Ugadi Festival 2024 :  భారతీయ సంప్రదాయం ప్రకారం.. ఒక ఏడాదిలో ఎన్నో రకాల పండగలు వస్తుంటాయి. ఆ పండగల రోజున ఆ పండగకు సంబంధించిన దేవుళ్లను, దేవతలను ప్రత్యేకంగా పూజించడం, తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం ఆచారం. ఈ క్రమంలో తెలుగువారంతా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ఉంది. సంవత్సరం ఆరంభంలో వచ్చే ఈ పండుగ అంటే ఎంతో మంది ఇష్టపడతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఉగాది(Ugadi) రోజున కొత్త సంవత్సరం(New Year) ప్రారంభమైనట్లు భావించడం.. అనాదిగా వస్తోన్న ఆచారం. ఉగాది కంటే ముందుగా అందరికీ.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకువస్తాయి. అలాగే ఉగాది రోజు చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుంది. అయితే ఉగాది రోజు ప్రత్యేకించి ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా?

ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుంచి స్రుష్టి మొదలైందని నమ్ముతుంటారు. అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తువులు ధరించి గడపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలకు కడుతారు. ఇంటి ముందు రంగవల్లితో తీర్చిదిద్దుతారు. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండగకు ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది.

ఈ నేపథ్యంలో ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండక్కి కాలమే దైవం. కాబట్టి ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అనంతరం వేపపువ్వుతో చేసిన ఉగాది పచ్చడి(Ugadi Pachadi) ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడికి వైద్య పరంగా విశిష్టమైన గుణం ఉంది. ఉగాది పచ్చడి వేసవి(Summer) లో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు జీవిత కష్ట సుఖాల కావడి కుండలు అని చెప్పడమే.

ఇది కూడా చదవండి: ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment