Kodali Nani: చంద్రబాబుకు వేల కోట్లు ఎక్కడివి.?

చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వ్యాపారంతో చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాధించారన్నారు. పోలీసులు తనను అరెస్ట్‌ చేస్తారని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

New Update
Kodali Nani: చంద్రబాబుకు వేల కోట్లు ఎక్కడివి.?

చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్‌ చేస్తారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్న ఆయన.. అవినీతికి పాల్పడితే చట్టం ఎవరినీ వదిలిపెట్టదన్నారు. చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పాలు, పిడికెలు అమ్మిన వ్యక్తికి వేల కొట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. పాలు అమ్మి పదివేల కోట్లు సంపాదించిన వారు దేశంలో ఎవరూ లేరన్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోచుకున్న డబ్బును వైట్‌గా మార్చడానికే పాల వ్యాపారం ప్రారంభించారని విమర్శించారు.

మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని కొడాలి నాని అన్నారు. కానీ చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేయకపోగా.. సీఎం జగన్‌ చేసిన అభివృద్ధి పనుల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎలాగో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్న ఆయన.. జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన అభివృద్ధి చూసి నేర్చుకోవడానికి సెల్ఫీలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు హైదరాబాద్‌ను నిర్మించానని చంద్రబాబు భావిస్తున్నాడన్న నానీ.. కానీ బాబు అక్కడ పోటీచేస్తే డిపాజిట్లు కూడా రావని మండిపడ్డారు.

గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్‌ డిజైన్‌లను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని, ఆయన ఎన్ని ఎత్తుగడలు వేసినా అధికారంలోకి రాడని కొడాలి నాని స్పష్టం చేశారు. అంతే కాకుండా తన పుత్రుడు, దత్తపుత్రుడు సైతం ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. పవన్‌, లోకేష్‌లు సైతం ఎన్ని ఎత్తుగడలు వేసినా, సినిమా డైలాగులు రాజకీయాల్లో ఉపయోగించినా ఎమ్మెల్యేగా గెలవలేరన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update

వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అధికారులను అడిగారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు.

అపరిశుభ్రతపై అసంతృప్తి..

అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు వెంట సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తదితరులు ఉన్నారు. 

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

(telugu-news | latest-telugu-news | telugu breaking news ap cm chandrababu naidu)

Advertisment
Advertisment
Advertisment