Whats App: మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లు..వాట్సాప్‌లో మరో అప్డేట్ తన యాప్‌ను అప్డేట్ చేసుకోవడంలో వాట్సాప్‌ను ఢీకొట్టేవాడే లేడు. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో దూసుకుపోతున్న ఈ సోషల్ మీడియా టాపర్...ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకువచ్చింది. By Manogna alamuru 15 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 3 Big Calling Features: ఇప్పుడూ కాదు భవిష్యత్తులో వాట్సాప్‌ను ఎవరూ అధిగమించలేరు అన్నట్టుగా యాప్‌ను అప్డేట్ చేస్తోంది మెటా. నెలకొకటి అయినా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతూ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కాలింగ్ ఫీచర్. 2015లో మొట్టమొదటిసారిగా వాట్సాప్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాన్ని దెవలప్ చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా ఒకేసారి మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తోంది. 32 మందితో వీడియో కాల్స్: కొత్త అపడ్ఏట్ ప్రకారం వాట్సాప్ వీడియో కాల్ ఇప్పుడు ఒకేసారి 32మంది మాట్లాడుకోవచ్చును. ఫోన్ లేదా డెస్క్టాప్ ఇలా సంబంధం లేకుండా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ ఇంట్రాక్ట్ అవచ్చు. దీని ద్వారా వైడర్ పీపుల్‌ను రీచ్ కావచ్చును అని అంటున్నారు వాట్సాప్ డెవలపర్లు. ఆడియోతో స్క్రీన్ షేరింగ్: వాట్సప్ కాల్‌లో ఉండగా ఇప్పుడు ఆడియోతో పాటు స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకోవచ్చును. ఆడియోతో పాటు వీడియోను చూడాలన్న సమయంలో లేదా కాల్ చేస్తున్నప్పుడు స్క్రీన్ పై ఏదైనా షేరింగ్ చేయాలనుకుంటే దీన్ని వినియోగించుకోవచ్చు. దీంతో గ్రూప్ కాల్స్ మరింత ఇంటర్ యాక్టివ్ గా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు జూమ్ లాంటివాటిల్లో నడిచిన ఆఫీస్ కాల్స్ లాంటివి ఇక మీదట వాట్సాప్‌లలో కూడా చేసుకోవచ్చును. స్పీకర్ స్పాట్లైట్: ఇకపోతే ఈ అప్డేట్ లో మనం గ్రూపు కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎవరు మాట్లాడుతున్న విషయం ట్రాక్ చేయవచ్చు. అయితే కొత్త స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ తో మాట్లాడుతున్న వ్యక్తి ఆటోమేటిక్గా స్క్రీన్ పై హైలైట్ అవుతుంది. మాట్లాడుతున్న వారు స్క్రీన్ పై మొదట కనిపిస్తారు. దాంతో కన్వర్జేషన్ మరింత సులభం అవనుంది. Also Read:T20 World Cup: గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు చేరుకున్న భారత్, అమెరికా జట్లు #meta #whats-app #calling-features #new-update మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి