Snake Bite : పాముకాటుకు గురైతే పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు

పాము కాటుకు గురైన వ్యక్తికి మొదటగా ధైర్యం చెప్పాలి. టెన్షన్‌ పడకుండా అతడిని కూల్‌ చేయాలి. గాయమైన చోట కదిలించకూడదు. గాయపడిన ప్రాంతంలో ఏదైనా బట్టలు, ఆభరణాలు ఉంటే వెంటనే తీసేయాలి. వెంటనే రోగిని ఎడమ వైపు పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాలని వైద్యులు చెబుతున్నారు.

New Update
Snake Bite : పాముకాటుకు గురైతే పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు

Snake Bite : భారతదేశం(India) లోని అడవులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి అడవుల్లో(Forest) వివిధ రకాల వన్యప్రాణులు కనిపిస్తాయి. ఈ జంతువులలో వివిధ జాతుల పాములు కూడా ఉన్నాయి. ఈ పాములు చాలా ప్రమాదకరమైనవి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు(Snake Bite) తర్వాత సకాలంలో వైద్య సదుపాయాలు(Medical Facilities) లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆయుష్ విభాగం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో పాము కాటుకు గురైన వ్యక్తి ఏం చేయాలి, చికిత్స గురించి వివరించారు.

పాము కాటేస్తే ఏం చేయాలి..?

  • మొదటగా పాము కాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి టెన్షన్‌ పడకుండా శాంతింపజేయాలని చెబుతున్నారు. అంతేకాకుండా గాయం అయిన చోట కదిలించకుండా అలాగే ఉంచాలి. గాయపడిన ప్రాంతంలో ఏదైనా బట్టలు, ఆభరణాలు ఉంటే వెంటనే తీసేయాలని నిపుణులు అంటున్నారు. వెంటనే రోగిని ఎడమ వైపు పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాలని చెబుతున్నారు.

పాము కాటేస్తే చేయకూడని పనులు:

  • సాంప్రదాయ, సొంత వైద్యం చేయడానికి ప్రయత్నించకూడదు. ఇలా చేయడం వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాము కాటు తర్వాత రోగి గాయాన్ని కట్టేసి రక్త ప్రసరణను ఆపడానికి ప్రయత్నించవద్దు. అంతేకాకుండా రోగిని వెనుకకు తిప్పి పడుకోబెట్టడం వల్ల శ్వాసకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు(Doctors) అంటున్నారు. పామును చంపడానికి ట్రై చేయొద్దని, ఎందుకంటే అది మీపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే పాము కాటు వేసిన ప్రాంతాన్ని బ్లేడుతో కోయడానికి యత్నించవద్దని, గాయంపై యాంటీ ఎనమ్ ఇంజెక్షన్ లేదా మందు వేయడానికి ప్రయత్నించవద్దని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: నత్తిగా మాట్లాడటానికి కారణాలు ఏంటి?.. చికిత్సతో నయం అవుతుందా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు