Monkey Mind: మంకీ మైండ్‌ అంటే ఏంటి?.. ప్రవర్తన ఎలా ఉంటుంది?

ఒక విషయంపై దృష్టిపెట్టకుండా పది రకాలుగా ఆలోచిస్తుంటే దాన్ని మంకీ మైండ్‌ అని పిలుస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఏ పనిపైనా ఏకాగ్రత చూపలేరని వైద్యులు అంటున్నారు. ఈ స్థితిలో మెదడు ఆందోళన, ఒత్తిడి, పరధ్యానం, దృష్టి లోపం, అలసట, పని ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.

New Update
Monkey Mind: మంకీ మైండ్‌ అంటే ఏంటి?.. ప్రవర్తన ఎలా ఉంటుంది?

Monkey Mind: మీరు కోతిని చాలాసార్లు చూసి ఉంటారు. కోతి ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా పరుగెత్తుతూనే ఉంటుంది. ఒక దగ్గరి నుంచి మరొక చోటికి దూకుతూ ఉంటుంది. కొన్నిసార్లు కోతులను మనుషులతో పోలుస్తారు. కానీ ఒక్కోసారి మన మెదడు కూడా కోతిలా ప్రవర్తిస్తుందని తెలుసా?. అవును అలాంటి పరిస్థితిని మంకీ మైండ్‌ అంటారు. మంకీ బ్రెయిన్ ఒకదానిపై దృష్టి పెట్టకుండా రకరకాలుగా ఆలోచిస్తుంటుంది. మంకీమైండ్‌ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మంకీ మైండ్‌ అంటే?

  • ఒక విషయంపై దృష్టిపెట్టకుండా పది రకాలుగా ఆలోచిస్తుంటే దాన్ని మంకీ మైండ్‌ అని పిలుస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఏ పనిపైనా ఏకాగ్రత చూపలేరని వైద్యులు అంటున్నారు. అంతేకాకండా ఏదైనా పనిలో విజయం సాధించడంలో కూడా వెనుకపడిపోతుంటారని చెబుతున్నారు. ఎందుకంటే ఈ స్థితిలో మెదడు ఆందోళన, ఒత్తిడి, పరధ్యానం, దృష్టి లోపం, మానసిక అలసట, పని ఒత్తిడి వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. మంకీ మైండ్‌సెట్‌ ఉన్నవారిలో ఒత్తిడి అధికంగా ఉంటుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి!

సమస్యను ఎలా అధిగమించవచ్చు?

  • మంకీ మైండ్‌ను నియంత్రించడానికి ఎటువంటి మందులు లేవు. కానీ కొన్ని పనులు చేయడం ద్వారా నివారించవచ్చు. పజిల్ గేమ్స్ ఆడటం, హాబీలపై దృష్టి పెట్టడం, విశ్రాంతి తీసుకోవడం, ఏకాగ్రత సాధన చేయడంతో పాటు మెడిటేషన్ కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుందని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రేమలో కొంచెం అసూయ కూడా అవసరమే..ఎందుకంటే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు