Saree వామ్మో.. చీర కట్టుకుంటే కూడా క్యాన్సర్ వస్తుందా? భారత్ లో చీర క్యాన్సర్ ఆడవారిని ఆందోళనకు గురి చేస్తోంది.బీహార్, జార్ఖండ్ లో చీర క్యాన్సర్ కేసులు అధికం అయ్యాయి. ప్రస్తుతానికి ఇది ఒక శాతంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. దీనిని వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు. By Bhavana 03 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Saree Cancer: క్యాన్సర్ (Cancer) పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ప్రపంచంలోని అతి భయంకరమైన రోగాల్లో క్యాన్సర్ ఒకటి. ఇందులో చాలా రకాలున్నాయి. లంగ్, నోరు, పేగు, అండాశయం, బ్రెస్ట్, స్కిన్, త్రోట్, గర్భాశయం ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఒకసారి శరీరంలోనికి క్యాన్సర్ వచ్చిందంటే దీనిని నుంచి కోలుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే తాజాగా భారత్ (Bharat) లో చీర క్యాన్సర్ ఆడవారిని ఆందోళనకు గురి చేస్తోంది. అసలు ఈ చీర క్యాన్సర్ ఏంటి.. ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం... భారతదేశం సంప్రదాయాలకు పుట్టిల్లు. చీరకట్టు మన సంస్కృతి. అయితే అసలు ఈ చీర వల్లే పెను ప్రమాదం ఉందని ఇప్పుడు గుర్తించారు. బీహార్ (Bihar), జార్ఖండ్ (Jarkhand) లో చీర క్యాన్సర్ కేసులు అధికం అయ్యాయి. ప్రస్తుతానికి ఇది ఒక శాతంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. దీనిని వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు. దీని గురించి ముంబైలో పరిశోధనలు కూడా చేశారు. మొదటిసారిగా ఓ 68 ఏళ్ల మహిళకు ఈ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. అందుకే దీనికి చీర క్యాన్సర్ అని పేరు పెట్టారు. క్యాన్సర్ గుర్తించిన మహిళ 13 ఏళ్ల నుంచి చీర కట్టుకుంటున్నట్లు వైద్యులు గుర్తించారు. చీర కట్టుకునేటప్పుడు లంగాను నడుముకు దారంతో గట్టిగా కట్టుకుంటారు. దీని వల్ల నడుము పై గట్టిగా రుద్దినట్లు అవుతుంది. అక్కడ చర్మం దెబ్బ తిని క్యాన్సర్ కు దారి తీస్తుందని వైద్యులు గుర్తించారు. Also read: భారీ అగ్ని ప్రమాదం.. 58 ఇళ్లు ఆహుతి! #mumbai #bihar #bharat #saree-cancer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి