Women Big Finger: మహిళలకు కాలి చూపుడు వేలు పెద్దగా ఉంటే ఏమవుతుంది?

కాలి బొటన వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఉన్న మహిళలు వారి భర్తలపై డామినేషన్‌ చూపిస్తారని అంటుంటారు. వైద్యులు మాత్రం అది కేవలం జన్యుపరంగా వస్తుందని, అందరికీ అన్ని అవయవాలు ఒకే పరిమాణంలో ఉండాలని లేదని చెబుతున్నారు. మూఢనమ్మకాలను కొట్టిపారేస్తున్నారు.

New Update
Women Big Finger: మహిళలకు కాలి చూపుడు వేలు పెద్దగా ఉంటే ఏమవుతుంది?

Women Big Finger: సాధారణంగా అందరికీ అవే అవయవాలు ఉన్నా.. కొందరికి వాటి పరిమాణాల్లో తేడాలు ఉంటాయి. కొన్ని అవయవాలు అయితే ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే.. కాలి బొటన వేలి కంటే చూపుడు వేలు చాలా మందికి పొడవుగా ఉంటుంది. ఇలా స్త్రీ (women)లకు ఉంటే చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మహిళలు (women) వారి భర్తలను డామినేట్‌ చేస్తారని, అంతేకాకుండా అజమాయిషీ కూడా చెలాయిస్తుంటారని చాలా మంది అంటారు. అందులో నిజమెంత అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఈ చిట్కాలు పాటిస్తే థైరాయిడ్‌ తగ్గుతుంది

కాలి బొటన వేలు కంటే చూపుడు వేలు పొడుగ్గా ఉంటే దాన్ని వైద్య భాషలో మిట్టెన్‌ ఫూట్‌ అంటారు. లేదా మార్టన్స్‌ టోయ్‌ అని పిలుస్తారని చెబుతున్నారు.1960లో అమెరికాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్‌ (Orthopedic Surgeon), ఫుట్ అనాట‌మిస్ట్ డ‌డ్లీ జాయ్ మార్టన్‌ పేర్ల ఆధారంగా వాటికి పేరు పెట్టారని అంటున్నారు. ఇలాంటి స్థితిని గుర్తించినందుకు ఆ పేర్లు పెట్టారని వైద్యులు అంటున్నారు. ఇలా చూపుడు వేలు పొడవుగా ఉండటం జ‌న్యుపరమైన (genetic) కార‌ణాల వ‌ల్లే అధికంగా సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ పనులు చేయడం వల్ల ఎంతో యవ్వనంగా కనిపిస్తారు

ఎలాంటి మూఢ నమ్మకాలకు తావులేదని అంటున్నారు. పాదాల బొట‌న వేలు కంటే చూపుడు వేలు పొడుగ్గా ఉంటే ఆ మహిళలు భర్త ( husbands) లపై డామినేషన్‌ (Domination) చూపిస్తారనడంలో అసలు అర్థమే లేదని సైంటిస్టులు (Scientists) కొట్టిపారేస్తున్నారు. ప్రతి మనిషిలో అవయవాలు భిన్న పరిమాణాల్లో మరియు రంగుల్లో తేడాలు ఉండటం సహజమని, అది జన్యుపరంగా సంక్రమిస్తోందని చెబుతున్నారు. అనవసరంగా మూఢనమ్మకాలు (Superstitions) నమ్మి అభాండాలు వేయాల్సిన పనిలేదని అంటున్నారు.

ఇది కూడా చదవండి: వామ్మో.. వాము వల్ల ఇన్ని ప్రయోజనాలా?

Advertisment
Advertisment
తాజా కథనాలు