Ice Water Benefits: ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ఏమవుతుంది..? ముఖ సౌందర్యానికి ఎన్నో క్రీమ్‌లు వాడుతూ ఉంటారు. అవన్నీ ఐస్ వాటర్ ట్రిక్ ముందు పని చేయవని.. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్‌ని ఫాలో చేస్తున్నారు. రోజూకి 3,4 సార్లు ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. By Vijaya Nimma 07 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ice Water Benefits: ముఖ సౌందర్యానికి ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు వాడుతూ ఉంటారు. కానీ.. అవన్నీ ఐస్ వాటర్ ట్రిక్ ముందు పని చేయవని సౌందర్య నిపుణులు అంటున్నారు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్‌ని ఎక్కవగా ఫాలో చేస్తున్నారట. అందుకే వాళ్లంతా నలభైలు దాటిన కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపిస్తున్నారు. అయితే.. అసలు ఐస్‌వాటర్ చర్మ సౌందర్యాన్ని ఎలా కాపాడుతుంది..? ఇది ఎంత మేలు చేస్తుందనే ఇప్పుడు తెలుసుకుందాం. ముఖానికి ఐస్ వాటర్‌తో కలితే ప్రయోజనాలు ఉదయం నిద్ర లేచిన తరువాత ముఖాన్ని కొద్దిసేపు ఐస్‌వాటర్‌లో డిప్ చేయాలి. ఇలా చేస్తే నిద్రమత్తుతో ఉన్న ముఖం క్షణాల్లో ఫ్రెష్‌గా అవుతుంది. ఇలా చేస్తే ముఖంపై ఉండే రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. అయితే చిన్న రంధ్రాల ఉంటే చర్మానికి ఇది చక్కగా పనిచేస్తుంది. అయితే.. ఈ చల్లటి వాటర్‌తో ముఖానికి రుద్దితే పొడిగా అయ్యి ర్యాష్ వచ్చే అవకాశం ఉంది. అయితే..ఓ మూడు నిమిషాలు ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచితే ముఖం గ్లాస్ స్కిన్‌లా అవుతుంది. సాధారణ టెంపరేచర్‌లో ఉన్న ముఖం ఒక్కసారిగి ఇలా చల్లటి నీటిలో ఉంచితే.. ముఖానికంతటికీ రక్తప్రసరణ జరిగి ఒక్కసారిగా తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. మనం వాడే మాయిశ్చరైజర్, స్క్రబ్‌ల కంటే ఈ ఐస్ వాటర్ ట్రిక్ చాలా మంచిగా పని చేస్తుంది. ఇలా రోజులో కనీసం3,4 సార్లు చేస్తే మెరిసే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇలా చేస్తే ముఖంపై వచ్చే వాపు తగ్గిస్తుందట. వాపుగా ఉన్న దగ్గర రక్త సరఫరా అవ్వడంతో కుచించుకుపోయిన నాళాలకు రక్తసరఫరా తగ్గి యథావిధిగా వచ్చి.. నొప్పి తగ్గుతుంది. ఐస్‌వాటర్‌లో ముఖాన్ని డిప్ చేసి ఉంచే ట్రిక్‌తో తమ అందాన్ని కాపాడుకోగలుగుతామని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: త్వరగా బరువు తగ్గించే 3 వ్యాయామాలు..తప్పక ట్రై చేయండి #health-benefits #beauty-tips #ice-water-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి