Egg Yolk : గుడ్డులోని పచ్చసొనతో కూడా ప్రయోజనాలు.. అస్సలు పడేయకండి గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొనను చాలామంది వదిలేస్తుంటారు. పచ్చసొన తినటం వలన ఆరోగ్యానికి ఎటువంటి హానీ లేదు. గడ్డులో పచ్చసోన తినకపోతే.. రోగనిరోధక శక్తి కోల్పోవడం, పోషకాల లోపం వంటి సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 12 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Eat Egg Yolk Health Benefits: గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొనను చాలామంది వదిలేస్తుంటారు. ఇలా పచ్చసొన పారేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే. పచ్చసొన మంచిది కాదేమోనని అనుమానం కొందరిలో ఉంటుంది. నిజానికి పచ్చసొన తినటం వలన ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలిగదని వైద్యులు అంటున్నారు. పైగా.. గుడ్డులోని తెల్లటి భాగాన్నే తింటే పచ్చసొనలో ఉండే ఎ, బి. ఇ. కె. విటమిన్లని పొందలేరని అంటున్నారు. పచ్చసొన తినకపోతే కలిగే నష్టాల గురించి కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గడ్డు తినటం వలన కలిపే ప్రయోజనాలు రోగనిరోధక శక్తి కోల్పోవడం: చాలామంది కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు గుడ్డులోని పసుపు భాగాన్ని తినకుండా వదిలేస్తారు.గుడ్లలో ప్రోటీన్లుతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ మినరల్స్, విటమిన్-డీ, బీ12 పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల శక్తి, రోగనిరోధక శక్తి, కళ్లను సురక్షితం, చర్మం, జుట్టుకి మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. పోషకాల లోపం: గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ అనే పోషకం ఉంది. ఇది.. చేపలు, చికెన్, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉడికించిన గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే.. మీరు దీనిని తినకపోతే పచ్చసొనలో ఐరన్, జింక్ ఈ పోషకాలు కోల్పోతారని చెబుతున్నారు. కొలెస్ట్రాల్: ఒక గుడ్డులో 187 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే.. మటన్, ఐస్ క్రీం వంటి ఆహార పదార్థాలతో పోలిస్తే డైటరీ కొలెస్ట్రాల్ తక్కువగానే ఉంటుంది. అలాంటి అప్పుడు గుడ్డులోని పసుపుభాగం తినటం గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. ప్రకృతి మనకు గుడ్డులో తెల్లసొన, పచ్చసొన కలిపే ఇచ్చింది కాబ్టటి కలిపే తినమని అర్థం. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: పూర్వజన్మల పాపాలు పోగొట్టే ఆలయ గంటలు! శాస్త్రం ఏం చెబుతోంది? #health-benefits #eat-egg-yolk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి