Exercise: వ్యాయామం చేసేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగకూడదా?..ఏమౌతుంది? ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. వ్యాయామం చేసేటప్పుడు మనం అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయి తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి ఎంత నీరు తీసుకోవాలో తెలుసుకోవాలంటో ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Exercise: వర్కవుట్ సమయంలో నీరు తాగడం చాలా ముఖ్యం. కానీ ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేసేటప్పుడు మనం అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయి తగ్గవచ్చు. దీనిని హైపోనట్రేమియా అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. సోడియం మన శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది నరాలు, కండరాల పనితీరులో సహాయపడుతుంది. ఎక్కువ నీరు తాగిన తర్వాత తలనొప్పి, గందరగోళం, అలసట లేదా వికారం అనిపిస్తే ఇవి హైపోనాట్రేమియా లక్షణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. అలాంటి సమయంలో వెంటనే నీరు తాగకుండా ఉండాలి. ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా వ్యాయామ సమయంలో ప్రతి 20 నిమిషాలకు 240 ml నీరు తాగాలి. ఈ పరిమాణం శారీరక శ్రమ, వాతావరణం, చెమట మీద ఆధారపడి ఉంటుంది. నీటితో పాటు వ్యాయామానికి ముందు, తర్వాత ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే పానీయాలను తీసుకోండి. వీటిలో సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి హైపోనాట్రేమియా ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామానికి ముందు బాగా నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శక్తిని కాపాడుతుంది. ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి 20 నిమిషాలకు కొంత నీరు తాగాలి. దీని వల్ల అలసిపోకుండా, శరీరం బాగా పని చేస్తుందని, డీహైట్రేషన్ బారిన పడకుండా చూసుకుంటుందని వైద్యులు అంటున్నారు. ఇది కూడా చదవండి: వేసవిలో పిల్లలకు ఎలాంటి దుస్తులు వేయాలి..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #exercise మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి