Medak: పిల్లలు నిద్రలేవడంలేదని తల్లి ఏం చేసిందంటే.! మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో భార్య తన పిల్లలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By Karthik 21 Aug 2023 in మెదక్ New Update షేర్ చేయండి పిల్లలు నిద్ర లేవడంలేదనే కోపంతో తల్లి వారిపై వేడినీళ్లు పోసిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంచర్ల సాయిలు, సంతోష దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు శ్రీనిధి, రిత్విక్‌ల స్కూల్‌కు టైమ్ అవుతుండటంతో.. తల్లి సంతోష వారిని పలు మార్లు లేపింది. తల్లి వచ్చినప్పుడు లేచిన పిల్లలు.. ఆమె బయటకు వెళ్లగానే మళ్లీ పడుకున్నారు. పిల్లలు లేవడంలేదనే కోపంతో ఊగిపోయిన సంతోష పిల్లలపై వేడినీళ్లు పోసింది. దీంతో శ్రీనిధి, రిత్విక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లల అరుపులు విన్న స్థానికులు ప్రమాద స్థలికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన కుమారుడు రుత్విక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సంతోష, సాయిలు మధ్య గతంలో అనేక సార్లు గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామ పెద్దలు వారికి అనేక సార్లు సర్ది చెప్పారన్నారు. అయినా దంపతులిద్దరు ఏదో ఒక విషయంలో తరుచు గొడవ పడుతుండేవారని తెలిపారు. ఆదివారం రాత్రి సాయిలు తాగి రావడంతో ఇంట్లో గొడవ జరిగిందని, ఇవాళ ఉదయం కూడా దంపతులు గొడవ పడ్డారని తెలిపారు. మరోవైపు పిల్లల కోసం వేడినీళ్లు పెట్టిన సంతోష. భర్తతో గొడవ పడ్డ కోపంతో పిల్లలపై వేడినీళ్లు పోసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దంపతులిద్దరిని స్టేషన్‌కు పిలిచిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు ఇంట్లోఉన్న సమయంలో గొడవలు పెట్టుకోవడం వల్ల వారు మెంటల్‌గా టిస్ట్రబ్ అవుతారని, తల్లిదండ్రులు పిల్లలు ఉన్న సమయంలో దుర్భాషలు వాడొద్దని సూచించారు. దీని ప్రభావం పిల్లల చదువుపై పడే అవకాశం ఉందని, ఫెరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు గొడవ పడొద్దని, దంపతుల మధ్య ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిస్తా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. #medak #hot-water #srinidhi #veldurdhi #santosh #sailu #rithvik మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి