Teenage Suicide: టీనేజర్ల ఆత్మహత్యలకు కారణమేంటి?..అధ్యయనాలు ఏమంటున్నాయి? టీనేజర్ల ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో ఎగ్జామ్ ఫోబియా. భయంతో పరీక్ష రాయకపోవడం, జబ్బు పడడం, ఆందోళన చెందడం మొదలైనవి జరుగుతుంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో కలగజేసుకుని మానసికంగా వారికి ధైర్యం చెప్పాలి. By Vijaya Nimma 13 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Teenage Suicide: దేశంలో టీనేజర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రేమలో విఫలం కావడం, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని దాంపత్యంలో ఒడిదుడుకులు, అప్పుల బాధ ఇలాంటి సంఘటనలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పరీక్షల్లో ఫెయిలయ్యాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 50 నుంచి 60శాతం మైనర్లే ఉన్నారని చెబుతున్నారు. NCRB విడుదల చేసిన గత ఐదేళ్ల డేటాను పరిశీలిస్తే 2018లో 1,529 మంది, 2019లో 1,577 మంది, 2020లో 1,129 మంది, 2021లో 864 మంది, 2022లో 1,123 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఆత్మహత్యలు పెరగడానికి కారణాలు 2020, 2021 సంవత్సరాల్లో ఆన్‌లైన్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ రెండేళ్లలో ఆత్మహత్యల సంఖ్య ఇతర సంవత్సరాల కంటే తక్కువగా ఉంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక తల్లిదండ్రులు ఏమంటారో అని కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మంచి కాలేజీలో అవకాశం దొరకదని, కెరీర్ ముగిసిందన్న మనస్తాపంతో మరికొందరు తనువు చాలిస్తున్నారు. ఎగ్జామ్ ఫోబియా కారణంగా ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని సైకాలజిస్ట్‌లు అంటున్నారు. కెరీర్‌లో విజయం సాధించలేమని భయం: భయంతో పరీక్ష రాయకపోవడం, జబ్బు పడడం, ఆందోళన చెందడం మొదలైనవి జరుగుతుంటాయని చెబుతున్నారు. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం మరో కారణం అంటున్నారు. ఆశించిన ఫలితాలు రాకపోతే కెరీర్‌లో విజయం సాధించలేమని మనసులో చిన్నప్పటి నుంచి బలంగా నాటుకుపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో కలగజేసుకుని మానసికంగా వారికి ధైర్యం చెప్పాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: షుగర్‌కు చెక్ పెట్టే ఫుడ్ ఐటెమ్స్ ఇవే..మీరు కూడా తినండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: మందులు వేసుకునేప్పుడు ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు #health-problems #suicides #teenage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి