Bhimavaram : అమాయకులే టార్గెట్‌గా సోనో విజన్‌లో ఘరానా మోసం

పశ్చిమ గోదావరి భీమవరం సోనో విజన్‌లో ఘరానా మోసం జరిగింది. అమాయకులే టార్గెట్‌గా చేసుకుని సుమారు కోట్ల రూపాయల వరకు మోసం చేశారు. పేద ప్రజల నుంచి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్‌లో వస్తువులు కొనిపించాడు సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్.

New Update
Bhimavaram : అమాయకులే టార్గెట్‌గా సోనో విజన్‌లో ఘరానా మోసం

పశ్చిమ గోదావరి భీమవరం సోనో విజన్‌లో ఘరానా మోసం జరిగింది. అమాయకులే టార్గెట్‌గా చేసుకుని సుమారు కోట్ల రూపాయల వరకు మోసం చేశారు. పేద ప్రజల నుంచి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్‌లో వస్తువులు కొనిపించాడు సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్. ఒకరికి తెలీకుండా మరొకరి దగ్గర ఇలా వందలమంది పేరుతో వస్తువులు కొనుగోలు చేశాడు రత్నాకర్. బాధితులకు కమిషన్ ఇచ్చి ఇంత భారీ మోసం చేశాడు సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్.

అయితే గత కొన్ని నెలలు ఈఏంఐ కట్టి తర్వాత రత్నాకర్ పరారీలో ఉన్నాడు. ఈఏంఐలు కట్టకపోవడంతో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులు భరించలేక ఆత్మహత్యకు సైతం ప్రయత్నించారు అత్తిలి చెందిన ఓ బాధితులు. అత్తిలి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు జీరో FIR నమోదు చేశారు. ఇలా వందలమంది నుంచి ఆధార్, పాన్ తీసుకుని లోన్ మీద రత్నాకర్ వస్తువులు కొన్నాడు.

సోనోవిజన్‌లో పని చేసే సిబ్బంది సహకారంతోనే ఈ మోసం జరిగిందంటున్నారు బాధితులు. ఈఎమ్ఐ డబ్బులు కట్టాలంటూ బాధితుల ఇళ్లకు బ్యాంక్ సిబ్బంది వెళ్తున్నారు. ఇలా బాధితుల పేర్లతో కొన్న వస్తువులను వేరే చోట రత్నాకర్ అమ్ముకున్నాడు. సోనోవిజన్‌లోని సిబ్బందితో కలిసి రత్నాకర్ మోసానికి పాల్పడిన్నాడపి బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రత్నాకర్ పరారీలో ఉన్నాడు. రెండు కోట్లకుపైగా విలువ చేసే వస్తువులు రత్నాకర్ కొన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు