Etela Rajender: తుమ్మల పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఎంతో మంది రాజకీయ నాయకులను వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వర్‌ రావును సైతం అలానే మోసం చేశారన్నారు. తుమ్మల బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని ఈటల స్పష్టం చేశారు.

New Update
Etela Rajender: తుమ్మల పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును సీఎం కేసీఆర్‌ అవసరానికి వాడుకొని వదిలేశారని ఈటల రాజేందర్‌ అన్నారు. తుమ్మల బీజేపీలోకి వస్తే తాము స్వాగతిస్తామని ఆయన తెలిపారు. ఆయన కమలం వైపు ముగ్గు చూపితే పాలేరు టికెట్‌పై చర్చిస్తామన్నారు. కేసీఆర్‌ అనేక మంది నేతలను మోసం చేశారన్న ఆయన.. కేసీఆర్‌ చేతిలో మోసపోయిన వ్యక్తుల్లో తాను కూడా ఉన్నానన్నారు. కేసీఆర్‌కు బుద్ది చెప్పాలంటే తుమ్మల లాంటి నేతలు బీజేపీకి అవసరమన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పార్టీలోకి వస్తే పార్టీ బలపడే అవకాశం ఉందన్నారు.

మరోవైపు తుమ్మల నాగేశ్వర్‌ రావు అనుచరులు మాత్రం ఆయన్ను కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లాలని చెబుతున్ననట్లు తెలుస్తోంది. క్యాడర్‌ను కాదని నేత సొంత నిర్ణయాలు తీసుకుంటే తర్వాత అనుచరులు తనకు సహకరించకపోవచ్చని, దీంతో ఎన్నికల్లో తనకు ఇబ్బందులు తప్పవని తుమ్మల నాగేశ్వర్‌ రావు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల తన అనుచరులతో సమావేశం అయిన తుమ్మల నాగేశ్వర్‌ రావు.. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పాలేరు నియోజకవర్గం నుంచే భరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. కానీ ఏ పార్టీలోకి వెళ్తాననే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

కాగా తుమ్మల విషయంలో తొందర పడ్డట్లు పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ పెద్దలు తుమ్మల నాగేశ్వర్‌ రావుతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, తుమ్మల విషయంపై సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు మాజీ మంత్రికి తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ పిలుపు కోసం మరో రెండు వారాలు ఎదురు చూస్తానని, ఆ తర్వాత కూడా పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకుంటే.. తాను ఏ పార్టీలో చేరుతాననే దాని గురించి క్లారిటీ ఇస్తానని మాజీ మంత్రి పేర్కొన్నారు.

ALSO READ: బీఆర్‌ఎస్‌ హటావో బీజేపీ బచావో

Advertisment
Advertisment
తాజా కథనాలు