Business : ఈ సీజన్ లో 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు..ఎన్ని కోట్ల వ్యాపారం అంటే...! చాలా కాలం తరువాత పెళ్లి ముహుర్తాలు రావడంతో ఈసారి సుమారు 42 లక్షలకు పైగా వివాహలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో సుమారు 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.ఈ ఏడాది సుమారు 1.2 లక్షల కోట్ల వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని భావిస్తున్నారు. By Bhavana 26 Feb 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Marriage Dates : గత కొన్ని నెలలుగా ముహుర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు(Marriages), ఫంక్షన్లు పెద్దగా జరగలేదు. సంక్రాంతి అయిన తరువాత నుంచి పెళ్లి ముహుర్తాలు భారీ ఎత్తున ఉండడంతో సుమారు 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగునున్నాయని నిపుణుల అంచనా. ఈ పెళ్లిళ్ల వల్ల ఈ రెండు మూడు నెలల్లో సుమారు 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి అంటే కేవలం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మాత్రమే కాదు కదా. పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఎన్నో తతంగాలు ఉంటాయి. మధ్య తరగతి వారు అయినా సరే జీవితంలో ఒకేసారి జరిగే వేడుక అని ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడుట లేదు. నిశ్చితార్థం(Engagement) అయిన తరువాత నుంచి ప్రీ వెడ్డింగ్ షూట్లని, పార్టీలనీ, బట్టలకు, పెళ్లి సామాగ్రికి ఇలా ఒక మధ్య తరగతి పెళ్లి కి సుమారు 9 నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్(Wedding Season) లోనే తమ బిజినెస్ ను మరింత పెంచుకోవాలని చూసే వ్యాపారులు కూడా సీజన్‌కి తగినట్లుగానే రేట్లు కూడా పెంచుతుంటారు. ఇక పెళ్లి బట్టలు, నగలు విషయంలో కూడా భారీగా వ్యాపారం జరుగుతుంది. ఇక విందు భోజనాల విషయానికి వస్తే.. ఒక పెళ్లి విస్తరాకులో సుమారు 30 నుంచి 32 ఐటమ్స్ వరకు ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఇవి కాకుండా శీతల పానీయాలు, ఐస్ క్రీములు, ఇతర ఆహార పదార్థాలకు గానూ సుమారు 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు జరుగుతుంది. అంతేకాకుండా ఎంత ఇంటి ముందు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా డెకరేషన్ విషయంలో కూడా ఎవరూ తగ్గట్లేదు. ఒక మండపాన్ని డెకరేషన్ చేయడానికి సుమారు 70 నుంచి 90 వేల వరకు తీసుకుంటున్నారు. కాస్త స్థితిమంతులు అయితే కొన్ని లక్షల రూపాయల డెకరేషన్ చేస్తున్నారు. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పెళ్లిళ్ల సీజన్ పుణ్యమా అంటూ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. జులై 15 వరకు భారీగా పెళ్లి ముహుర్తాలు ఉన్నాయి. కేవలం వివాహలకు సంబంధించిన వస్తువుల కొనుగోలు ద్వారానే భారీగా నగదు మార్కెట్లోకి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ విదేశాల్లో మాత్రమే కాకుండా మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో చేసుకుంటున్నారు చాలా మంది. దీంతో డెస్టినేషన్ వెడ్డింగ్ పుణ్యమా అంటూ వివిధ రాష్ట్రాల్లోని వివాహ వేడుకలకు సంబంధించిన ప్రదేశాలు జులై చివరి వరకు బుక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది తమ పెళ్లిని మూడు నుంచి ఐదు రోజుల పాటు చేసుకుంటున్నారు. దీంతో కల్యాణ మండపాలకు కూడా భారీ డిమాండ్ పెరిగింది. గతేడాది డిసెంబర్ 14తో పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. ఆ సమయంలో సుమారు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. ఆ సమయంలోనే సుమారు రూ. 4.25 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తుంది. చాలా గ్యాప్ తరువాత వివాహ ముహుర్తాలు ఉండడంతో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరిన్ని పెళ్లిళ్లు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో రూ. 1.25కోట్ల వ్యాపారం అదనం గా జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. Also Read : మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు.. అలర్ట్! #telangana #wedding-season #5-5-lakhs-crore-business #42-lakhs-marriages మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి