Chocolates: చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయా..? చాక్లెట్ తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. ముఖం బాగున్నవారు చాక్లెట్లు ఎక్కువగా తిన్నా, జన్యువులలో సమస్య ఉన్నవారిలో మాత్రమే వస్తాయి. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు శరీరంలోని ఇతర భాగాలకు, చర్మానికి మేలు చేస్తాయి. By Vijaya Nimma 20 Oct 2024 in వెబ్ స్టోరీస్ Latest News In Telugu New Update Chocolates షేర్ చేయండి ముఖంపై మొటిమలు కనిపించడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఇందులో ఆహారం, పర్యావరణం వంటి అంశాలు ఉంటాయి. అయితే చాక్లెట్ తినడం వల్ల కూడా మొటిమల సమస్య పెరుగుతుందని కొందరి అభిప్రాయం. చాక్లెట్ చూసి టెంప్ట్ అవ్వని వారు ఉండరు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైనది. కానీ కొన్ని పరిశోధనలలో చాక్లెట్ తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని తేలింది. ఎక్కువగా నూనె తినడం వల్ల మొటిమల సమస్య వస్తుందని సాధారణంగా వినే ఉంటారు. కానీ చాక్లెట్ వల్ల కూడా జరుగుతుందని ఎవరూ ఊహించరు. Also Read : హైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ సేవలు: కిషన్ రెడ్డి చాక్లెట్ వల్ల మొటిమలు వస్తాయా..? 1960లలో చాక్లెట్, మొటిమల మధ్య సంబంధాన్ని గుర్తించడానికి అనేక అధ్యయనాలు జరిపారు. అతిపెద్ద అధ్యయనంలో కేవలం 65 మందిని మాత్రమే చేర్చారు. ఇందులో మొటిమలు, చాక్లెట్ మధ్య ఎటువంటి సంబంధం లేదని గుర్తించారు. అయితే ఈ అధ్యయనం చాలా విమర్శలకు దారి తీసింది. ముఖం మీద మొటిమలకు చాక్లెట్ కారణమని చెప్పలేమని, మనం ఏది తిన్నా, తాగినా అది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. కొవ్వు, నూనె, చక్కెర, పాల ఉత్పత్తులు అధికంగా ఉండే ఆహారాలతోనూ మొటిమలు వస్తాయంటున్నారు. Also Read : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్ లండన్ చర్మ నిపుణులు ఏం చెబుతున్నారు..? కింగ్స్ కాలేజ్ లండన్‌లోని చర్మ నిపుణుడు చెప్పేదాని ప్రకారం కౌమారదశలో ముఖంపై మొటిమలు జన్యుపరమైనవని అంటున్నారు. వాస్తవానికి మన చర్మంలోని నూనెను ఉత్పత్తి చేసే గ్రంధుల పరిమాణం మన జన్యుశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ముఖంపై మొటిమల ఫిర్యాదులు ఇటీవల పెరిగాయి. ముఖ్యంగా మహిళల్లో అయితే నిర్దిష్ట కారణం లేకుండానే వస్తున్నాయి. ఏ చాక్లెట్ తింటే మొటిమలు వస్తాయి? ఓ నివేదిక ప్రకారం చాక్లెట్ తినడం వల్ల 5 కంటే ఎక్కువ మొటిమలు వస్తాయని కనుగొన్నట్లు చెప్పారు. 5 పాపుల్స్ తక్కువగా అనిపించినప్పటికీ, అవి పగిలిన తర్వాత వాటి సంఖ్య పెరగవచ్చు. ముఖం బాగున్నవారు చాక్లెట్లు ఎక్కువగా తినడం ప్రారంభిస్తే మొటిమలు వస్తాయని అంటున్నారు. డార్క్ చాక్లెట్ వల్ల మొటిమలు పెరుగుతాయని అంటున్నారు. Also Read : సినిమా పై నెగటివ్ కామెంట్స్.. ట్విటర్ డీయాక్టివేట్ చేసిన స్టార్ డైరెక్టర్ మొటిమలను ఎలా నివారించాలి? అధిక కేలరీలు, తక్కువ పోషకాలు కలిగిన ఆహారాలు శరీరంలో మంటను కలిగిస్తాయి. అయితే మొటిమలు జన్యువులలో సమస్య ఉన్నవారిలో మాత్రమే వస్తాయని అంటున్నారు. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు శరీరంలోని ఇతర భాగాలకు ఎంత మేలు చేస్తాయో, అదే విధంగా చర్మానికి కూడా మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: కార్డియాక్ డిప్రెషన్ అంటే ఏంటి? #best-skin-tips #acne #chocolates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి