నేషనల్ వరదలతో వణుకుతున్న ఉత్తర భారతం దేశ రాజధాని ఢిల్లీతో సహా.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌తో సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చాలా వాహనాలు లోయలో పడిపోయాయి. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling హైదరాబాద్‌లో కుంభవృష్టి, అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు హైదరాబాద్ జంటనగరాల పరిధిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి మేఘాలు కమ్మేసి చీకటిగా మార్చాయి. నగరంలోని నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కొండాపూర్, మాదాపూర్, హబ్సీగూడలో భారీ వర్షం దంచి కొడుతోంది. దీంతో నగరమంతా తడిసి ముద్ధయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సమీక్షిస్తున్నారు. By Shareef Pasha 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling హైదరాబాద్‌లో రెండు గంటల పాటు దంచికొట్టిన వాన హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, అమీర్ పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ముషీరాబాద్, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ,జూబ్లిహిల్స్, కోఠి, మోహిదీపట్నం, బేగంపేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్ తో పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. By P. Sonika Chandra 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హమ్మయ్య.. ముప్పు తప్పింది అల్లూరి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు పెనుప్రమాదం నుంచి బయటపడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయుంటే బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలన్నీ గాలికలిసిపోయేవే. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రాణాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. By Vijaya Nimma 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సం... విదర్భలో 19 మంది మృతి..!! మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అకోలాలో 107.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భలోని అమరావతి డివిజన్‌పై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అటు గుజరాత్ కూడా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పంజాబ్ లో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. By Bhoomi 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరికి అంతకంతకూ పెరుగుతోన్న వరద...!! రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజూ వర్షాలు కొనసాగాయి. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 23.15.సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు కృష్ణా నదిలోకి సైతం తొలిసారి వరద మొదలైంది. అంతేకాక ఉమ్మడి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ సహా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dhavaleswaram:ధవళేశ్వరం వద్ద నిలకడగా ఉన్న గోదావరి...ముప్పు తప్పినట్లేనా...!! తూర్పుగోదావరి జిల్లాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఓ పక్క వరద నీటితో ధవళేశ్వరం నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఎక్కువగా ఉండటంతో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ konaseema:వరద గుప్పిట్లో కోనసీమ...బిక్కుబిక్కుమంటున్న గ్రామాలు...!! భారీ వర్షాల కారణంగా కోనసీమ వాసులను వరద నీరు భయపెడుతుంది. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ లంక ప్రజలు జీవిస్తున్నారు. ఎప్పుడు వరద నీరు పెరుగుతుందా అని వణికిపోతున్నారు. ఇంకా వరద నీటిలో కోనసీమ ఎన్ని రోజులు ఉంటుందని లంక గ్రామాలు ఆందోళన చెందుతున్నారు. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heavy Rains : వామ్మో...ఇవేం వానలు...యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరిక..!! దేశవ్యాప్తంగా వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 22 రాష్ట్రాల్లోని 235 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. గుజరాత్, హిమాచల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. హథిని కుండ్ బ్యారేజీ (Hathini Kund Barrage) నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రజలు మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn