Scrolling హైదరాబాద్‌లో ముంచెత్తిన వాన, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు గత కొన్నిరోజులుగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌తో సహా తెలంగాణ ప్రాంతమంతా తడిసిముద్దయ్యింది.నిన్న మాత్రం స్వల్ప బ్రేక్ ఇచ్చింది. హమ్మయ్యా వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకునే సమయానికి మరోసారి హైదరాబాద్ నగరాన్ని సోమవారం (31-07-2023) వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని ప్రజలంతా తీవ్ర అవస్ధలు పడ్డారు.రాబోయే 48 గంటల్లో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. By Shareef Pasha 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అన్నం లేక చనిపోతున్న దయనీయ పరిస్థితులు.. రోడ్డుపైనే అంత్యక్రియలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. లంక ప్రజలకు చావు కష్టాలు తప్పటం లేదు. గంటగంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుండంతో జిల్లాలో టెన్షన్ నెలకొంది. లంక గ్రామాల్లో చాలా మందికి తినడానికి అన్నం కూడా లేక చాలా మంది చనిపోతున్నారు. రోడ్లపైనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. By Vijaya Nimma 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మునిగిపోయిన సంగమేశ్వర ఆలయం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరాలయం చుట్టూ నీటిమట్టం పెరుగుతోంది. గర్భాలయంలోకి నీరు చేరింది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. By Vijaya Nimma 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వరద నష్టంపై అంచనా.. తెలంగాణలో కేంద్ర అధికారుల బృందం తెలంగాణలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల.. వంతెనలు కూలిపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కాలనీల్లోకి నీరు పోటెత్తటంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. By Vijaya Nimma 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హమ్మయ్య.!..ఇక భారీ వర్షాల ముప్పు తప్పినట్టేనట...!? చెరువులు నిండిపోయాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నగరాల్లోను,పట్టణాల్లోనూ రోడ్లు జలదిగ్భంధమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.అయితే జనం బాధ వరుణుడు విన్నాడు. ఏపీ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, సౌత్ ఒడిశాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంద్రలో కేంద్రీకృతమై ఉందని..అమరావతి వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ,అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని ఏపీ వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ ఇచ్చింది.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉందని వెల్లడించింది. By V. Sai Krishna 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ప్రకృతి సృష్టించిన విధ్వంసం, ముగ్గురు మృతి గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో కురిసిన వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని విషాదానికి గుర్తులుగా మిగిలిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల కారణంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పదుల సంఖ్యలో జనం వరదలో గల్లంతయ్యారు ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లావ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పొంగిపొర్లుతున్న మున్నేరు వాగు.. జలదిగ్భందంలో గ్రామాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల రైతులు తీవ్ర నష్టపోయారు. By Karthik 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. By Karthik 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling పాలకుర్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు, పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ జనగామ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా జిల్లాలోని ఆయా మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో అప్రమత్తమైన అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. మరోపక్క అత్యవసర పనులకు వెళ్లాలనుకునే వారు, కూళీ పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఏదేమైన మరో రెండు రోజులు ఆగక తప్పదంటూ పోలీసులు కోరారు. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn