పెరుగుతున్న చలి తీవ్రత.. ఇవాళ, రేపు కష్టమే

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల నమోదవుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

New Update
Weather update

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9 గంటలు అవుతున్న కూడా పొగమంచు తగ్గడం లేదు. పెరుగుతున్న చలి వల్ల వృద్ధులు, చిన్నారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాలలో పొగమంచు విపరీతంగా ఉంది.

ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

ఈ మండలాల్లో ప్రస్తుతం 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ముఖ్యంగా నేడు, రేపు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్‌ ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగిపోతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగులలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ఠంగా 4.1 డిగ్రీలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

చలి కారణంగా పొగమంచు విపరీతంగా పడుతోంది. వాహనాలు నడిపే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగమంచు కారణంగా రహదారి కనిపించదు. కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి. అలాగే స్వెటర్లు, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలని సూచిస్తు్న్నారు. స్నానానికి, తాగడానికి వేడి నీరు ఉపయోగించాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు. 

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు