Heavy Rain Alert: ఏపీకి మరో ముప్పు..ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను

బంగాళాఖాతాన్ని ఒకదాని తర్వాత ఒకటి సైక్లోన్లు చుట్టుముట్టుడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు, చైన్నై లాంటివి వర్షాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను మిచాంగ్ ఏపీని అల్లకల్లోలం చేయనుందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ

New Update
Heavy Rain Alert: ఏపీకి మరో ముప్పు..ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను

Cyclone Michaung: ఈ ఏడాది నాలుగో తుఫాను భారతదేశాన్ని తడిపియేడానికి రెడీగా ఉందని అంటోంది వాతావరణశాఖ (IMD). మిథిలీ తుఫాను బీభత్సం చల్లారక ముందే మిచాంగ్ అనే తుపాను విరుచుకుపడబోతోందని చెబుతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రంలో మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని తెలిపారు. ఇది దిసెంబర్ 1 కల్లా తుఫానుగా మారుతుందని అంటున్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని... నవంబర్ 30నాటికి ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి మిచాంగ్ తుఫానుగా నామకరణం చేశారు. తుఫాను ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Also read:ఎన్నికల సందర్బంగా దేవాలయాల బాట పడుతున్న అగ్ర నేతలు

తుపాను ప్రభావం వల్ల గంటకు 35 - 45 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని..మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 1న గంటకు 50 కి.మీ - 60 కి.మీ వేగంతో, డిసెంబర్ 2న గంటకు 50-60 కి.మీ నుండి 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల్లో భారీగా వర్సాలు పడే అవకాశం ఉంది. ఇక నార్త్ లో కూడా తుఫాను ప్రభావం ఉండనుంది. జమ్ము కశ్మీర్-లద్దాఖ్-గిల్గిత్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్ లలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కూడా వానలు పడతాయి. మధ్యప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో ఉరుములు, మెరుపులతో కూడిన పడుతుందని అధికారులు తెలిపారు. ఇక సౌత్ లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా తుఫాను ప్రబావం ఉండనుంది. ఈ మిచాంగ్ తుఫాన్ వల్లనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు, రేపు వర్షాలు పడనున్నాయి.

Also read:దేశ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి.. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి: కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు