మాదే అధికారం: కేటీఆర్, రాహుల్ గాంధీ ట్వీట్లు ఎవరికివారు మాదే అధికారం అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీలు తమ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ధీమాగా చెబుతున్నారు. By Manogna alamuru 30 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా జరుగుతోంది. కానీ అప్పుడే ముఖ్యనేతలు స్పందించేస్తున్నారు. అధికారం మాదే అంటే మాదే అని పోటాపోటీగా ప్రటించేస్తున్నారు. హైదరాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ (KTR) తరువాత ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తెలంగాణలో అన్నిచోట్ల నుంచి తమకు రిపోర్ట్‌లు వస్తున్నాయని...కారే టాప్ గేర్ లో ఉందంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. Getting reports from all over the state Car in Top Gear 👍 Jai Telangana — KTR (@KTRBRS) November 30, 2023 మరోవైపు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ (Rahul Gandhi) కూడా ఇదే ధీమాను వ్యక్తం చేశారు. దొరల మీద ప్రజలు గెలబోతున్నారు. కాంగ్రెస్ దే విజయం అంటూ పోస్ట్ పెట్టారు. బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ కు ఓటు వెయ్యడానికి తరలి రండి అంటూ పిలుపునిచ్చారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి! Today, Prajala will defeat Dorala! Brothers and sisters of Telangana, step out and vote in large… pic.twitter.com/yvrvNMBziX — Rahul Gandhi (@RahulGandhi) November 30, 2023 #ktr #rahul-gandhi #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి