PM Modi: బీఆర్ఎస్ తో కలిసే సమస్యే లేదు తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. By Manogna alamuru 27 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తెలంగాణను నాశనం చేశారని మోదీ ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రజలు విసిగిపోయారని...తరువాతి సీఎం బీజేపీ నుంచే వస్తారని అన్నారు. తెలంగాణకు బీజేపీ నుంచి వచ్చే సీఎం బీసీ అయుంటారని చెప్పారు. ప్రభుత్వ మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకూ స్థానం ఉంటుందని చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారు. కానీ తాము అందుకు అవకాశం ఇవ్వలేదని తెలపిఆరు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండదలుచుకోలేదని వివరించారు. తెలంగాణకు ఫామ్ హౌస్ సీఎం అవసరం లేదని మోదీ విమర్శించారు. సచివాలయాన్ని మార్చడం మీద మండిపడ్డారు. Also Read:అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్ రావు ఫైర్.. బీఆర్ఎస్ మయాంలో జరిగిన స్కామ్లు అన్నింటి మీదా దర్యాప్తు చేస్తామని అన్నారు మోదీ. అందులో ఎవరున్నా సరే విడిచిపెట్టమని చెప్పారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ చేతులు కలపదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. శాంతి వ్యవస్థను నష్టం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల, బంజారా జాతుల శ్రేయస్సును బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పటు చేశామన్నారు. ఆ యూనివర్సిటీ పేరును ఆదివాసీ ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సరక్కల పేరు కూడా పెట్టామన్నారు. మాదిగల వర్గీకరణ బీజేపీ సకరిస్తుందని చెప్పారు మోదీ. సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదు దీంతో కేంద్ర వాటి ధరలను తగ్గించినా...ఇక్కడ మాత్రం అవి కిందకు దిగలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మోదీ చెప్పారు. Also Read:గూస్ బంప్స్ తెప్పిస్తున్న కాంతార ఛాప్టర్-1 ఫస్ట్ లుక్. #narendra-modi #telangana-elections-2023 #pm #campaigning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి