Rahul Gandhi: 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం... రాహుల్ గాంధీ కీలక ప్రకటన

TG: దేశంలోని నిరుద్యోగులను మోడీ పట్టించుకోలేదని విమర్శించారు రాహుల్ గాంధీ. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 దినసరి కూలీ ఇస్తామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు.

New Update
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో.. ఈసారి అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముమ్మర ప్రచారం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగారు. ఆదివారం నాడు నిర్మల్‌లో నిర్వహించిన జన జాతర సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన రాహుల్.. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తివేయడమేనని పేర్కొన్నారు. తీము అధికారంలోకొస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని రాహుల్‌ తెలిపారు.

ALSO READ: కాంగ్రెస్ నేత మధు యాష్కీకి తప్పిన ప్రమాదం

దేశవ్యాప్తంగా తెలంగాణ హామీల అమలు..

బీజేపీ పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామంటే తప్పుపడుతున్నారని.. మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు రుణాలు ఎందుకు మాఫీ చేసిందని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్ల నిధులను మాఫీ చేశారంటూ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. 16 లక్షల కోట్లతో 25 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చని రాహుల్ గాంధీ వివరించారు. తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

ప్రతి మహిళ అకౌంట్లో రూ.1లక్ష..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లో ఏడాదికి రూ. లక్ష వేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దేశంలోని నిరుద్యోగులను మోడీ పట్టించుకోలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తామన్నారు. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసుల్ని సర్వనాశనం చేసిందన్నారు. ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 దినసరి కూలీ ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశంలో కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు