MP Laxman: కేసీఆర్ హటావో తెలంగాణ బచావో.. బీజేపీకా జితావో సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు రాష్ట్రంలో మూడోదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్యణ్ ప్రకటించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు కృంగి, కృషించి పోయారన్న ఆయన.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర తరహా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. By Karthik 14 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు రాష్ట్రంలో మూడోదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్యణ్ ప్రకటించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు కృంగి, కృషించి పోయారన్న ఆయన.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర తరహా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్‌లో మీడియతో మాట్లాడిన ఆయన.. “కేసీఆర్ హటావో తెలంగాణ బచావో బీజేపీకా జితావో” అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని, రుణాలు మాఫీ కాక.. తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో విద్యా, వైద్యానికి డిమాండ్ పెరిగిందని, రోగాలతో బాధపడుతున్న ప్రజలు ఆస్పత్రికి వెళ్లాలంటే ఆస్పత్రి యాజమాన్యం వేసే బిల్లులను చూసి భయాందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. పెరిగిన పీజులతో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని, విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కుల వృత్తుల పేరుతో ప్రజలను ఆగం చేస్తున్నారన్న లక్ష్మణ్.. బీసీబంధు కింద లక్ష రూపాయలు అందిస్తామని వారికి ఆశచూపి కేవలం కొందరికి మాత్రమే అందించారన్నారు. కేసీఆర్ ప్రజలకు చేసిన మోసాల గురించి రాస్తే మహాభారతం కూడా చిన్నదే అవుతుందని ఎంపీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీరు ఇవ్వని సీఎం.. బారు.. బీరు షాపుల సంఖ్యను మాత్రం పెంచారని విమర్శించారు. జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ.. మద్యం అమ్మకాల పరంగా మాత్రం టాప్ 2లో ఉందని ఎద్దేవా చేశారు. లిక్కర్‌తోనే కాకుండా డ్రగ్స్ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను దూరం పెట్టిన కేసీఆర్.. ఉద్యమ ద్రోహులను మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ 16న పల్లెబాట, బస్తీ బాట పేరుతో కార్యక్రమం చేపడుతామని, 17న బాధితులతో కలిసి బీఆర్‌ఎస్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉంటుందని, 18న అసెంబ్లీ కేంద్రంగా రహదారులపై రాస్తారోకో చేపడుతామని తెలిపారు. ఆగస్ట్ 23 నుంచి రెండో విడత ఉద్యమం ఉంటుందని ఎంపీ తెలిపారు. 23న దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థాయి నుంచి ధర్నా కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 24 రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామన్నారు. 25న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు. మరోవైపు సెప్టెంబర్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్న ఎంపీ లక్ష్మణ్.. అనంతరం మూడో విడత పోరాటం ఉంటుందని, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. #brs #kcr #bjp #modi #mp-laxman #regime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి